నాకు మల్లెపూలు ఇచ్చిన ఫస్ట్ మగాడు మానస్..
on Jun 13, 2025
కిరాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో ప్రీ-ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి స్పెషల్ థీమ్ ని తీసుకొచ్చారు. అదేంటంటే "మీరు ఒకరికి ఒకరు గుర్తుగా గిఫ్ట్ ఇచ్చుకోవాలి అంటే ఎం ఇచ్చుకుంటారు" అని హోస్ట్ శ్రీముఖి అడిగింది. ఇందులో తేజస్విని మడివాడ తన చేతికి వచ్చిన గిఫ్ట్ ప్యాక్ ని ఓపెన్ చేసింది. "మల్లెపూలు" అని గట్టిగా అరిచింది. మల్లెపూలు చూసి శ్రీముఖి ఇంకా గట్టిగా అరిచింది. ఆ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్. "నాకు మల్లెపూలు ఇచ్చిన ఫస్ట్ మగాడు మానస్" అని చెప్పేసింది తేజస్విని.
ఇక శ్రీముఖి ఆ మల్లెపూలు తీసుకుని తేజస్విని కొప్పులో అలంకరించింది. అలాగే తేజు కూడా బొట్టు పెట్టుకుంది. "నిన్ను పద్ధతైన అమ్మాయిగా చూడాలనుకున్నాడు కాబట్టి మల్లెపూలు తెచ్చాడు" అంటూ శ్రీముఖి పెద్ద కామెంట్ ఐతే చేసింది. కానీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో మాత్రం "అది అవ్వదమ్మ" అంటూ వినిపించేసరికి అందరూ నవ్వుకున్నారు. ఇక తర్వాత డెబ్జానీ ఒక గిఫ్ట్ ప్యాకెట్ ని తీసుకొచ్చి అమరదీప్ కి ఇచ్చింది. "ఏదైనా హార్ట్ షేప్ లో ఉన్న సింబల్ ఏమన్నా ఇచ్చి ఉంటుంది" అన్నాడు. కానీ ప్యాకెట్ ఓపెన్ చేసిన శ్రీముఖి అందులో కర్చీఫ్ ఉండడం చూసి అవాక్కయింది. "కర్చీఫ్ ఎందుకు ఇచ్చావ్" అంటూ డెబ్జానీని అడిగింది. "అందరినీ చూసి సొల్లు కార్చుకుంటావ్ కదా..తుడుచుకోవడానికి ఇది" అంటూ ఆ కర్చీఫ్ ని అమరదీప్ చేతిలో పెట్టింది. తర్వాత బాయ్స్ కి గర్ల్స్ కి ఒక టాస్క్ ఇచ్చింది. వాటర్ బెలూన్ నీళ్ళల్లో మునుగుతుందా, తేలుతుందా అని అడిగేసరికి మునుగుతుంది అని మానస్ రాసాడు తేలుతుంది అంటూ ప్రియాంక జైన్ రాసింది. కానీ ఆ వాటర్ బెలూన్ కాసేపు మునుగుతూ, తేలుతూ కనిపించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
