"కమింగ్ సూన్"...అమ్మాయా, అబ్బాయా త్వరలో చెప్తాం
on Jun 13, 2025
బుల్లితెర మీద అంజలి- పవన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ ఇద్దరూ భార్య భర్తలు సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరయ్యారు. మొగలి రేకులు సీరియల్ తో అంజలి బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు అంజలి పవన్ అలాగే వీళ్ళ ముద్దుల కూతురు చందమామ అలియాస్ ధన్వికతో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తోంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఐతే ఇప్పుడు అంజలి రెండో సారి తల్లయ్యింది. రీసెంట్ గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఐతే పుట్టింది ఆడపిల్లా, మగపిల్లాడా అన్నది మాత్రం రివీల్ చేయలేదు.
ఐతే వీళ్ళు "కమింగ్ సూన్" అంటూ పోస్ట్ చేశారు. ఐతే త్వరలో ఈ విషయాన్నీ చెప్పబోతున్నారన్న విషయం తెలుస్తోంది. 2017 లో సీరియల్ నటుడు సంతోష్ పవన్ ని అంజలి పెళ్లి చేసుకుంది. కూతురు చందమామతో కూడా ఫోటోషూట్స్ అవి చేయిస్తూ ఆమెకు కూడా ఒక స్పెషల్ పేజీని ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి అందులో పోస్ట్ చేస్తున్నారు. అలాగే అన్ని రకాల బుల్లితెర షోస్ కి కూడా ఈ చిన్నారిని తీసుకొస్తున్నారు. బుల్లితెర షోస్ లో అంజలి పవన్ వాళ్ళ అమ్మాయి చందమామ అలాగే విశ్వ వాళ్ళ అబ్బాయి ర్యాన్ మంచి ఫ్రెండ్స్ లా మారిపోయారు. వీళ్ళిద్దరే ఈ మధ్య షోస్ లో ఎక్కువగా కనిపిస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
