
బుల్లితెర మీద శ్రీసత్య రియాలిటీ షోస్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి శ్రీసత్య తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను, అలాగే జనాలు పెట్టే కామెంట్స్ మీద తన అభిప్రాయాన్ని ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
"నాకు మధ్యలో కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడంతో మందుల వలన నేను కొంచెం లావయ్యాను. దీనికి కూడా బాడీ షేమింగ్ చేస్తారు. జనాలు ఆల్రెడీ నన్ను బాడీ షేమింగ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఏం చేస్తోందో ఇంత లావైపోతోంది అంటూ చాలా వల్గర్ లా మాట్లాడేస్తున్నారు. అందుకే చదువుకోవాలి. ఆడోళ్లకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ప్రతీ 12 రోజులకోసారి నెలసరి వచ్చేస్తుంది. దీన్ని భరించడం అంత ఈజీ అనుకుంటున్నారా? వాళ్లకు ఏం తెలుసు అమ్మాయిలకు ఎం జరుగుతుందో. వాళ్ళు అలా చేస్తారు కాబట్టే అందరూ అదే చేస్తారనుకుంటారు.
ఏమీ తినకపోయినా కూడా కొంతమంది లావైపోతారు. వయసు పెరిగే కొద్దీ బాడీలో చేంజెస్ వస్తాయి. పదేళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే ఎలా కుదురుతుంది. నేను జిమ్ కి వెళ్లినా వర్కౌట్స్ చేసినా ఫేస్ చేంజ్ వస్తుంది. అప్పుడు కూడా మీరంతా నన్ను ఏదో ఒకటి అంటూ కామెంట్స్ పెడతారు. వర్కౌట్ చేస్తే ఈ క్యూట్ ఫేస్ కూడా ఉండదు.
మా అమ్మ ఆరోగ్యం చూసుకోవడానికి ఫీజియోథెరపీకే నాకు చాలా డబ్బులు అవుతున్నాయి. నాన్న బిజినెస్ మొత్తం పోయింది. నాకు సొంత కార్ లేదు, సొంత ఇల్లు లేదు. ఆస్తులు ఏమీ లేవు. ఉన్న హౌస్ కూడా అమ్మేసాం. ఈ మొహం ఇలా ఉన్నంత వరకు ఓకే వర్క్ వస్తోంది కానీ తర్వాత ఏంటి నా పరిస్థితి అనే ఆలోచన ఎక్కువైపోయింది. వీళ్ళిద్దరినీ ఎలా చూసుకోవాలి అనిపిస్తుంది. " అని చెప్పింది శ్రీసత్య.






