Home

»

Tv News

Jayam serial: శకుంతలకు షాకిచ్చిన ప్రీతి.. ప్రమీల కోసం రంగంలోకి దిగిన రుద్ర!

Mar 24, 2026

జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -224 లో... శకుంతల అన్న మాటలకి ప్రమీల భోజనం చెయ్యకుండా ఏడుస్తుంది. గంగ, స్నేహ ఇద్దరు భోజనం తీసుకొని వస్తారు కానీ ప్రమీల భోజనం చెయ్యకుండా బాధపడుతుంది.

అప్పుడే రుద్ర వచ్చి తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటాడు. తనకి ఇలా బాధపడడం అలవాటే కదా అని రుద్ర అంటాడు. అలా కాదు బావగారు అని ప్రమీల చెప్పబోతుంటే నువ్వు ఎక్స్ ప్లెయిన్ చెయ్యాల్సింది నిన్ను నమ్మని వాళ్లకు.. నీకు అండగా ఉన్నవాళ్ళకు కాదని రుద్ర అంటాడు. నువ్వు ఏంటో అసలు ఏం జరిగిందో అంతా చెప్పాల్సింది కదా అని రుద్ర అంటాడు. నువ్వు ముందు భోజనం చెయ్ పరిస్థితిని రెక్టీఫై చేస్తానని రుద్ర అనగానే ప్రమీల భోజనం చేస్తుంది. 

మరుసటి రోజు రుద్ర పై నుండి కిందకి వస్తాడు. గంగ కాఫీ తీసుకొని రా అని అంటాడు. అదంతా చూసి రుద్ర మళ్ళీ ఏదో చేస్తున్నాడని అందరికి డౌట్ వస్తుంది. బావ ఏదో చేయబోతున్నాడు చెల్లి అని గంగతో రంగా అంటాడు. వీరు దగ్గరికి ఇషిక వెళ్లి మళ్ళీ రుద్ర బావ ఏదో చేయబోతున్నాడని అనగానే అదంతా ఏం లేదు ఇక నన్నే అత్తయ్య గారు సూపర్ మార్కెట్ చూసుకోమని చెప్తారని వీరు కాన్ఫిడెంట్ గా ఉంటాడు.

మావయ్య గారు నేను కొత్త బిజినెస్ కి పార్టనర్ కోసం వెళ్తున్నానని వీరు కావాలనే అంటాడు. వద్దు సూపర్ మార్కెట్ చూసుకోమని శకుంతల అంటుంది. నువ్వు నాకు విలువ ఇస్తే నేను చెప్పింది వినమని శకుంతల అనగానే సరే అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని వీరు ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటే.. అప్పుడే ప్రీతి వచ్చి ఆగమని చెప్తుంది. వాళ్ళ బిజినెస్ లు నువ్వు చూసుకోవడం ఎందుకు.. రేపు ఇంట్లో పని, వంట పని చేయమని చెప్తే చేస్తావా అని వీరూతో ప్రీతీ అంటుంది. దాంతో వీరూతో పాటు ఇషిక, శకుంతల షాక్ అవుతారు.

అందరు హాల్లోనే ఉంటారు. నేను డెలివరీ వరకే ఈ ఇంట్లో ఉంటాను.. తర్వాత వెళ్ళిపోతాను. నా బిడ్డ వాళ్ళ నాన్న ఇల్లరికం అల్లుడు అని తెలియోద్దని ప్రీతీ అంటుంది. నా మాట విను లేదంటే నేను ఏం అనుకుంటున్నానో నీకు ఎలా తెలుస్తుందని ప్రీతితో శకుంతల అంటుంది. నిన్న ప్రమీల మాట కూడా మీరు వినలేదు కదా పెద్దమ్మ.. అసలు పరాయి మగాడితో మాట్లాడని ప్రమీల బైక్ పై వచ్చిందంటే తను ఏ పరిస్థితిలో అలా చేసిందో అర్ధం చేసుకోలేదని రుద్ర చెప్తాడు. గంగ నువ్వు వెళ్లి ప్రమీలని తీసుకొనిరా అని గంగని రుద్ర పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com