Home

»

Tv News

Illu Illalu Pillalu: ప్లాన్ మార్చిన వేదవతి.. కోడలికి మామూలు పనిష్మెంట్ కాదుగా!

Mar 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -426 లో... విశ్వని ప్రేమించమని అమూల్యకి చెప్పింది శ్రీవల్లి అని వేదవతికి తెలిసి, తన సంగతి చెప్పాలని వెళ్తుంటే వేదవతి అంతరాత్మ ఆపుతుంది.

ఇప్పుడు వెళ్లి నిజం చెప్పాక నా తండ్రికి ఆ పరిస్థితి రావడానికి కారణం భార్య అని నీ పెద్దకొడుకు తనని చంపి జైలుకి వెళ్తాడు. అప్పుడు నేను ఏరికోరి తీసుకొని వచ్చిన కోడలు ఇలాంటిది అని మీ ఆయనకి తెలిస్తే ఎలా ఉంటుందని తన అంతరత్మ అనగానే వేదవతి సైలెంట్ గా ఉంటుంది. నీకు నిజం తెలిసిందని తెలియకుండా శ్రీవల్లిని టార్చర్ పెట్టాలని అంతరత్మ అనగానే వేదవతి సరే అంటుంది.

ఆ తర్వాత శ్రీవల్లి డాన్స్ చేస్తుంటే వేదవతి వెళ్తుంది. ఏంటి అత్తయ్య సీరియస్ గా ఉన్నారు.. ఆ ప్రేమ, నర్మద గురించి ఆలోచిస్తున్నారా అని శ్రీవల్లి అనగానే.. వేదవతి ఆమె రెండు చెంపలు వాయిస్తుంది. అత్తయ్య ఏమైందని శ్రీవల్లి అంటుంది. నా ముందు ఆ ప్రేమ, నర్మద టాపిక్ తియ్యకని వేదవతి అంటుంది. శ్రీవల్లిని మళ్ళీ కొడుతుంది. మళ్ళీ ఏమైంది అత్తయ్య అని అడగగా.. అయ్యో నీలో ఆ ప్రేమను చూసుకున్నానే అని వేదవతి యాక్టింగ్ చేస్తుంది. 

ఆ తర్వాత ప్రేమ, నర్మద కలిసి శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలు అన్ని రికార్డు చేసి శ్రీవల్లికి వినిపిస్తారు. ఆ రికార్డింగ్ ఎక్కడ నుండి వస్తుందో వల్లికి అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అలా ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకుంటుంది శ్రీవల్లి. ఆ తర్వాత ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి శ్రీవల్లి ముందుకి వచ్చి రికార్డింగ్ పెడతారు. మీరు మా అమ్మతో మాట్లాడేటప్పుడు రికార్డు చేయడం తప్పు అని శ్రీవల్లి అంటుంది. నా బుజ్జి చెల్లెలు కదా డిలీట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. 

అలా ఏం చెయ్యం మ్యూజిక్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ అనగానే వల్లి అటు ఇటు పరుగెడుతుంది.దాంతో పైన ఉన్న పిండి మొత్తం వల్లిపై పడిపోతుంది. అది చూసి వేదవతి దెయ్యం అనుకుంటుంది. అయ్యో వల్లి నువ్వా అనగానే వల్లి సైలెంట్ గా ఉండడంతో అత్తయ్య తనకి దెయ్యం పట్టిందని ప్రేమ, నర్మద అనగానే చీపురు పట్టుకొని వల్లిని వేదవతి బాగా కొడుతుంది. దెబ్బకి దెయ్యం వదిలింది అని అంటుంది. దాంతో ప్రేమ, నర్మద నవ్వుకుంటారు. చందు కూడా వల్లిని కొట్టి సారీ చెప్తాడు.

ఆ తర్వాత ప్రేమ, నర్మద పక్కకి వెళ్లి నవ్వుకుంటారు. నవ్వి నవ్వి అమ్మ అంటూ ప్రేమ తన పొట్ట పట్టుకొని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com