.webp)
బిగ్ బాస్ సీజన్-10 పదో వారం ఫ్యామిలీ వీక్ సాగుతోంది. హౌస్ ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిపోయింది. నరేష్ తమ్ముడు సురేష్ వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన రెండో ఫ్యామిలీ శ్వేతదే. బీబీ స్కూల్ టాస్క్ నడుస్తున్న టైంలోనే బిగ్ బాస్ శ్వేతని ఫ్రీజ్ అని చెప్తాడు. ఆ టైంకి రెండు కుక్క పిల్లలు ఉన్న ఫోటోని పంపిస్తాడు. అది చూసి శ్వేత ఏడ్చేస్తుంది. అందరూ శ్వేతను ఓదార్చుతుంటే.. అందరూ ఫ్రీజ్ అని చెప్పేస్తాడు బిగ్ బాస్. ఇంటి నుంచి వచ్చిన లెటర్ చూసి శ్వేత ఎమోషనల్ అవుతుంది.
నేను రాలేకపోతోన్నాను సారీ అని ఇంటి నుంచి తండ్రి పంపిన లేఖ నిజమనుకుని శ్వేత ఏడ్చేస్తుంటుంది. ఇంతలో ఆమె తండ్రి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. తండ్రిని చూసిన శ్వేత ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. బాగా ఆడుతున్నావ్.. ఇంకా నీ టాలెంట్ చూపించమని తండ్రి సలహా ఇస్తాడు. ఎప్పుడూ మీ గురించే చెప్తుంది.. డాడీ.. డాడీ.. డాడీ.. అని అంటూనే ఉంటుందని త్రిగుణ్ చెప్తుంటాడు. శ్వేత తండ్రితో పాటు ఆమె చెల్లి కూడా హౌస్‌లోకి వచ్చింది. తండ్రి, చెల్లిని చూసి శ్వేత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.
శ్వేత తండ్రి వేసిన రింగ్ మటన్ కి పడింది. దాంతో హౌస్ మేట్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్వేత వాళ్ళ నాన్నని ఎత్తుకొని తిరుగుతారు. శ్వేత ఫ్యామిలీ రాకతో ఇల్లంతా సందడిగా మారింది. అయితే ఇదే టైంలో రామకృష్ణ ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు కనపడ్డాడు.అందరి ఫ్యామిలీలు వస్తుంటే తన ఫ్యామిలీ ఎప్పుడు వస్తుందోనని రామకృష్ణ ఎదురుచూస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ మూమెంట్లో మాత్రం కాస్త ఎమోషనల్‌గా కనిపించాడు. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌కి ఈ ఫ్యామిలీ వీక్ అనేది ఎంతో ఇంపార్టెంట్‌గా ఉంటుంది. శ్వేతకి తండ్రి, చెల్లి రావడంతో ఆమెకి పెద్ద బూస్ట్ వచ్చినట్టు అయింది. గత కొన్ని రోజులుగా గేమ్‌లో కాస్త డల్‌గా ఉన్న శ్వేత.. ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో ఆడే ఛాన్స్ ఉంది. మరి రామకృష్ణ ఫ్యామిలీ వచ్చిన తర్వాత అతడి గేమ్ ఎలా మారుతుంది.. ఈ ఫ్యామిలీ వీక్‌లో ఇంకా ఎవరెవరి ఫ్యామిలీలు వస్తాయనేది చూడాలి మరి.





