మిలింద్ సోమన్ తో ఫోటో కోసం పుషప్స్ తీసిన సింగర్ శ్రావణ భార్గవి
on Jan 26, 2026
ఒక సింగర్, ఒక అందాల నటుడు ఒక పార్క్ లో కలిస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే మిలింద్ సోమన్ - రావూరి శ్రావణ భార్గవిలా ఉంటుంది. ఇంతకు వీళ్లిద్దరు ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా. ముంబై జరిగిన మారథాన్ లో వీళ్ళు ఒక పార్క్ లో కలిశారు. ఐతే శ్రావణ భార్గవి ఒక ఫోటో అడిగేసరికి మిలింద్ వెంటనే తన కోసం ఒక పాట పాడాలని అలాగే పుషప్స్ కూడా తీయాలని కోరాడు. అలాగే శ్రావణ భార్గవి తనతో కలిసి పాట పాడితేనే పుషప్స్ తీస్తానని చెప్పేసరికి కలిసి ఒక హిందీ పాట పాడాడు. తర్వాత ఎన్ని పుషప్స్ తియ్యమంటారు అని శ్రావణ మిలింద్ ని అడిగేసరికి 10 అన్నాడు. వెంటనే చేసేసింది. చాలా బాగా పుషప్స్ తీస్తున్నారంటూ కితాబిచ్చేసారికి ఆమె క్రాస్ ఫిట్టర్ అంటూ అక్కడున్న వాళ్ళు మిలింద్ కి చెప్పారు. తర్వాత పార్క్ లో కనిపించిన ఒక పిల్లాడితో జనగణమన పాడాలని అడిగారు. ఇప్పుడు కుదరదు అన్నాడు. నాతో ఫోటో కావాలంటే ఏదో ఒకటి పాడాల్సిందే. లేదంటే పంపించను అనేసరికి ఆ పిల్లాడి చేత సరిగమ అంటూ రాగాలు నేర్పి పలికించింది శ్రావణ భార్గవి. ఇక శ్రావణ వెంటనే మీరు కూడా పాడండి అంది. వందేమాతరం అంటూ పాడారు మిలింద్ సోమన్. "మీతో ఫోటో దిగాలంటే పుషప్స్ చేయాలా ఐతే ఇక నుంచి నేను కూడా అదే ఫాలో అవుతా నాతో ఎవరైనా ఫోటో అడిగితె ఒక పాట పాడితేనే ఫోటో ఇస్తాను అని చెప్తా" అంది శ్రావణ భార్గవి. ఈ వీడియోని శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి "హ్యాపీ రిపబ్లిక్ డే" అని పోస్ట్ పెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



