శివాజీ నెంబర్ వన్.. చివరి స్థానంలో టేస్టీ తేజ!
on Oct 3, 2023
బిగ్ బాస్ హౌజ్ లో సోమవారం జరిగిన నామినేషన్లో మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. శివాజీ, యావర్, అమర్ దీప్, శుభశ్రీ , ప్రియాంక జైన్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ నామినేషన్లో ఉన్నారు.
పల్లవి ప్రశాంత్, ఆట సందీప్, శోభా శెట్టి హౌజ్ మేట్స్ గా ఉన్నందున వారు నామినేషనలో లేరు. ఒక ఓటింగ్ పోల్ విషయానికొస్తే శివాజీ వన్ మ్యాన్ షో నడుస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్లో నమోదవని ఓటింగ్ శివాజీకి వచ్చింది. అత్యధికంగా 60% ఓటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక తర్వాతి స్థానంలో ప్రిన్స్ యావర్, శూభశ్రీ రాయగురు ఉన్నారు. ఇక సీరియల్ బ్యాచ్ కి గడ్డుకాలమే అనిపిస్తుంది. చివరి స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడు. అయితే అమర్ దీప్, టేస్టీ తేజలకి స్వల్ప తేడాతో ఉన్నారు. అమర్ దీప్ కి గనుక ఈ నాలుగు రోజుల్లో ఓటింగ్ పడకుండా టేస్టీ తేజకి పడితే ఈ సారి అమర్ దీప్ ఎలిమినేట్ అవడం కాయం. ఇక కన్నింగ్ స్టార్ ప్రియాంక జైన్ మ్యానిపులేషన్ చేస్తుందని హౌజ్ లో అందరికి తెలిసిపోయింది.
మొన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్‌లో శివాజీ ఎందుకు బయాజ్ అని ప్రియాంకని నాగార్జున అడిగినప్పుడు.. తడబడింది. చెప్పిన సమాధానం కూడా వ్యాలిడ్ కాదని నాగార్జున అన్నాడు. అలాగే శోభా శెట్టి కూడా ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా సమాధానం చెప్పడంతో సీరియల్ బ్యాచ్ అంతా గ్రూప్ గా ఆడుతున్నారని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అందుకేనేమో ప్రియాంక జైన్ కి ఓటింగ్ చాలా తక్కువ వస్తుంది. మరి ఈ వారం నామినేషన్లో ఉన్న సీరియల్ బ్యాచ్ నుండి అమర్ దీప్, ప్రియాంక జైన్ సేఫ్ అవుతారా లేదా చూడాలి మరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
