Home

»

Tv News

Karthika Deepam2 : శివనారాయణ ఆగ్రహం!

May 28, 2026 10:45AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -681 లో..... కార్తీక్, దీప హాస్పిటల్ లో దక్షిణామూర్తిని కలిసి మాట్లాడతారు. మా తాత మీకు రక్తం ఇచ్చి కాపాడాడని కార్తీక్ చెప్పగానే ఆ విషయం మీ తాతకి తెలుసా అని దక్షిణామూర్తి అడుగుతాడు. లేదని కార్తీక్ చెప్తాడు. ఇక కార్తీక్, దీప ఇంటికి బయల్దేరతారు. దక్షిణామూర్తి ప్రాణాలు కాపాడింది మావయ్య గారే అని జరిగింది మొత్తం కాంచనకి శ్రీధర్ చెప్తాడు. ఆ విషయం జ్యోత్స్న, పారిజాతం వింటారు. ఒక మంచి ఛాన్స్ దొరికిందని అనుకుంటారు. అప్పుడే కార్తీక్, దీప ఇంటికి వస్తారు. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. ఏంటి బావ విషయం తెలిసిందా అని కార్తీక్ తో దీప అంటుంది. తెలిసే అవకాశం లేదని కార్తీక్ అంటాడు.

ఏంటి బావ మీరు గుమ్మం దగ్గర ఉండే మాట్లాడుకుంటున్నారు.. మీరు చేసిన గొప్ప పని గురించి చెప్పాలి కదా అని జ్యోత్స్న అంటుంది. తాత మీరు చాలా గ్రేట్ రక్తం ఇచ్చి ఒక ప్రాణాలు కాపాడారని శివన్నారాయణతో జ్యోత్స్న అంటుంది. తాత పదండి దక్షిణామూర్తి దగ్గరికి అని జ్యోత్స్న అనగానే ఏం మాట్లాడుతున్నావ్ జ్యోత్స్న అని శివన్నారాయణ కోప్పడుతాడు. ఇప్పుడు మీరు రక్తం ఇచ్చి కాపాడింది మీ శత్రువు అని తెలిస్తే కాపాడుతారా అని జ్యోత్స్న అనగానే ఆ పరిస్థితి రావద్దని అనుకుంటానని శివన్నారాయణ అంటాడు. మీరు రక్తం ఇచ్చి కాపాడింది మీ శత్రువు దక్షిణామూర్తిని.‌ ఆ విషయం బావని కాదని చెప్పమని చెప్పండి అని జ్యోత్స్న అంటుంది. నాలో కట్టలు తెంచుకునే కోపం వస్తుంది కానీ నీ సమాధానం కోసం చూస్తున్నాను చెప్పు అతను ఎవరని శివన్నారాయణ అడుగుతాడు.

దక్షిణామూర్తి తాత అని కార్తీక్ అనగానే కార్తీక్ చెంపచెల్లుమనిపిస్తాడు శివన్నారాయణ. కార్తీక్ మిమ్మల్ని బ్లడ్ ఇవ్వమని చెప్పలేదు కదా అని శ్రీధర్ అనగానే వాడికి అతను శత్రువు అని తెలిసినప్పుడు నాకు చెప్పాలి కదా అని కోప్పడతాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని తోసేస్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ దగ్గరికి వెళ్లి మీరు నాకు నేర్పిన ధర్మం తప్పమంటారా.. మీరు ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వదిలేసి వెళ్తారా అని కార్తీక్ అంటాడు. ఎక్కడ శివన్నారాయణ మారిపోతాడోనని జ్యోత్స్న అనుకుంటుంది. నీ మాటలతో మార్చాలని చూడకు బావ అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి కార్తీక్ వెళ్లి నేను చేసింది తప్పు అంటావా అత్త అని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com