Home

»

Tv News

Illu illalu pillalu : ధీరజ్‌ను కేసులో ఇరికించాలని చూస్తున్న సేనాపతి జంట!

May 28, 2026 10:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -482 లో..... ధీరజ్ కార్ తీసుకొని డ్రైవింగ్ కి వెళ్తాడు. పాపం ధీరజ్ తిన్నాడో లేదోనని ప్రేమ తనకి మాటిమాటికీ ఫోన్ చేసి కనుక్కుంటుంది. ధీరజ్ ఎక్కడున్నాడో కనుక్కొని తనకి ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. క్యాబ్ లో ఎక్కిన వాళ్ళు అది చూసి.. నీ భార్యకి నువ్వంటే ఎంత ఇష్టం.. నువ్వు తిన్నావో లేదోనని కనుక్కుంటుందని వాళ్ళు అంటుంటే.. అది ఫుడ్ ఆర్డర్ చెయ్యడం ఏంటో గానీ నా పర్సు ఖాళీ అవుతుందని ధీరజ్ అంటాడు.

మరొకవైపు సేనాపతి, భద్రవతి దగ్గరికి ధీరజ్ ఫైనాన్స్ ఇచ్చిన అతను వస్తాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు.. వాడి దగ్గర కార్ ఉండకూడదు.. ఫైనాన్స్ కట్టలేక ఇబ్బంది పడాలని భద్రవతి అనగానే అతను కార్ తీసుకొని వారం రోజులు కూడా కాలేదు EMI కట్టకపోతే కార్ తీసుకొని రావచ్చు.. ఇంకా ఇరవై రోజులు ఆగాలని అతను అనగానే అంత ఓపిక లేదని భద్రవతి అంటుంది. అతని కార్ లో ప్రభుత్వం నిషేదించిన వస్తువులు దొరికితే కార్ సీజ్ చేస్తారు. ఇంకా తనపై కేసు అవుతుందని అతను చెప్పడంతో భద్రవతి, సేనాపతి ఇద్దరు ధీరజ్ ని ఆ కేసులో ఇరికించాలని అనుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ కి ప్రేమ కాల్ చేస్తుంది. ధీరజ్ వెనకాలే ఉంటాడు. ఏంటే నీకు ఇంటి దగ్గర ఉండి బోర్ కొట్టి నాకు ఫోన్ చేసి చంపేస్తున్నావ్.. నువ్వు ఆర్డర్ చేసిన ఫుడ్ కి పన్నెండు వందల అయ్యాయి.. నేను ఈ రోజు సంపాదించింది వెయ్యి రూపాయలని ధీరజ్ అంటాడు. నాకు జాబ్ వచ్చాక నువ్వు తిన్న వాటికి కూడా డబ్బు ఇస్తానని చెప్పి ప్రేమ అలుగుతుంది.

దాంతో ధీరజ్ మళ్ళీ తనని బుజ్జగించే పనిలో పడుతాడు. తనకి ఐస్ క్రీమ్ తినిపిస్తాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ , వల్లి వాళ్ళు భోజనం చేస్తారు. నేను అంటే కడుపుతో ఉన్నాను.. ప్రేమ ఎందుకు భోజనం చేస్తుంది.. వడ్డించాలి కదా అని వల్లి అనగానే నాకు కోపం రానివ్వకు.. నీ పని నువ్వు చూసుకో అని ప్రేమ కోప్పడుతుంది. అవును వదిన ప్రేమ అసలే మెంటల్ ది ఎవరు తనని ఏడిపించినా వాడి తల పగులగొట్టేదని ధీరజ్ అంటాడు. అవును వదిన నన్ను విశ్వ ఫ్రెండ్స్ ఏడిపిస్తుంటే అమ్మవదినలు ఇద్దరు కలిసి వాళ్ళ సంగతి చెప్పారని అమూల్య అంటుంది. నర్మద దూరం నుంచి వాళ్ళ వంక చూస్తుంది. పాపం అక్కకి ఆకలిగా ఉన్నట్లుంది. అక్కకి వంట రాదని ధీరజ్ తో ప్రేమ అంటుంది. అప్పుడే సాగర్ ఇంటికి వస్తాడు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదని నర్మద ఆడుగుతుంది. ఫోన్ జేబులో ఉందని సాగర్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com