Home

»

Tv News

Brahmamudi : ఇందు,రాజుల శోభనానికి అపర్ణ ప్లాన్.. రేఖ ప్లాన్ కి భ్రమరాంబ కౌంటర్!

May 28, 2026 10:49AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1043 లో..... రాజు ఇందు కలిసి పరందామయ్య దగ్గరికి వెళ్తారు. మిమ్మల్ని చూస్తే అచ్చం రాజ్, కావ్యలని చూసినట్టు ఉందని అతను అంటాడు. మేం సీఈఓగా పోటీ చేస్తున్నాం.. మీరు మాకు సపోర్ట్ చెయ్యాలని ఇందు చెప్తుంది. మీ అమ్మనాన్న ఉన్నప్పుడు ఆఫీస్ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది.. అంతా ఆ రేఖకి ఇష్టం వచ్చినట్లు జరుగుతుంది. నేను ఎదురించిన ప్రతీసారి నన్ను అవమానించారు. బోర్డు మెంబర్ గా ఉండొద్దు అనుకున్నాను కానీ సీతారామయ్యకి ఇచ్చిన మాట కోసం ఉండాల్సి వస్తుందని అతను అంటాడు.

నేను సీఈఓ అయితే మళ్ళీ కంపెనీకి పూర్వ వైభవం తీసుకొని వస్తానని ఇందు అనగానే అంతకన్నా కావల్సింది ఏం లేదని పరందామయ్య అంటాడు. మరొకవైపు మదన్ కోసం రేఖ వెయిట్ చేస్తుంది. ఏంటి రేఖ ఇక్కడున్నావని భ్రమరాంబ, శేషు అడుగుతారు. అప్పుడే మదన్ వస్తాడు. ఎక్కడకి వెళ్ళావ్.. ఉంటే గదిలో ఉంటున్నావ్ లేదా బయటకు వెళ్తున్నావని రేఖ అడుగుతుంది. నువ్వు ఇప్పుడు ఆ ఇందుకి దగ్గర అవ్వాలి.. ఆ రాజు గాడితో విడాకులు ఇప్పించి నీకు ఇందుకి పెళ్లి చేస్తాను.. నువ్వు తనకి దగ్గర అయ్యే ప్రయత్నం చెయ్ అని రేఖ అంటుంది. దానికి మదన్ సరే అంటాడు. అదంతా విని నువ్వు అనుకున్నది. నేను ఎలా జరగనిస్తానని భ్రమరాంబ అనుకొని శేషుకి ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత అపర్ణ, సుభాష్ కి వినపడేలా పాపం ఇందు పరిస్థితిని చూస్తే జాలిగా ఉంది.. పెళ్లి అయింది అన్నట్లే గానీ ఇంకా ఏ అచ్చట ముచ్చట జరగలేదని శేషుతో భ్రమరాంబ అంటుంది. మనకెంటే వాళ్లే పట్టించుకోవడం లేదని శేషు అంటాడు.

వాళ్ళ మాటలు విన్న సుభాష్, అపర్ణ వాళ్ళు మాట్లాడింది కూడా నిజమే కదా.. వాళ్ళ ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టమని పెట్టమని చెప్తానని సుభాష్ తో అపర్ణ అంటుంది. మరొకవైపు వెంకీ ఇంటర్వ్యూకి వెళ్తుంటే నందు తనకి ఒక షర్ట్ పంపిస్తుంది. అది వేసుకొని వెళ్ళమని నందు చెప్తుంది. ఈ అమ్మాయి చాలా మంచిది.. అలాంటి వాళ్ళని వదులుకోకూడదని వెంకీతో లక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com