
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -60 లో.....మాధవ ఇంటర్వ్యూ ఏర్పాట్ చేసాడని మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తీరా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక చక్రి ఫోన్ చేసి ఈ ఫేక్ ఇంటర్వ్యూ కండక్ట్ చెయ్యలేనని చెప్పగానే చక్రి టెన్షన్ పడుతాడు. మహా ఆఫీస్ ముందు వెయిట్ చేస్తుంది. చక్రి వెళ్లి ఇంటర్వ్యూ ఇప్పుడు లేదట అని చెప్తాడు. అయ్యో నా వల్లే లేట్ అయిందేమోనని మహా ఫీల్ అవుతుంది. మరొకవైపు శైలు తన ఫ్రెండ్ తో కలిసి స్కూటీ తీసుకొని వెళ్ళిపోయినట్లు ఫ్రాంక్ చేస్తుంటే కేశవ చూస్తాడు. హెల్మెట్ పెట్టుకొని వెళ్లి తనతో ఒక ఆట ఆడుకుంటాడు. హెల్మెట్ తియ్యగానే నువ్వారా అని శైలు గొడవపడుతుంది.
మొన్న సూపర్ మార్కెట్ లో మూడు వేలు, ఆ తర్వాత మొన్న బైక్ కి.. మొత్తం డబ్బు ఇరవై వేలు తియ్ అంటాడు. లేవని శైలు అనగానే తన ఫోన్ లాక్కొని డబ్బు ఇచ్చి తీసుకొని వెళ్ళు అని కేశవ వెళ్ళిపోతాడు. మరొకవైపు మహా ఇంటికి వచ్చి పాపం పెద్ది ఇంటర్వ్యూ ఇప్పిస్తే ఇలా అయిందని ఫీల్ అవుతుంది. అప్పుడే మాధవ వస్తాడు. తను బాధపడుతుంటే చూడలేక నాతో రా అమ్మ అని తను పని చేసే దగ్గరికి తీసుకొని వెళ్లి నేను ఆర్కిటెక్ కాదమ్మా మేస్త్రి అని చెప్పగానే మహా షాక్ అవుతుంది. ఇంటర్వ్యూ కూడా నేను ఇప్పించలేదని మాధవ చెప్తాడు. వాడు అసలు ఎందుకు నీకు అబద్ధం చెప్పాడో అర్థం కావడం లేదు. నేను కూడా నీతో అబద్ధం చెప్పి మోసం చేయలేను. నన్ను క్షమించు అని మాధవ అంటాడు. మీరేం చేశారు.. మీ తమ్ముడు చేసిన దానికి మీరెందుకు క్షమాపణ చెప్తున్నారని మహా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత శైలుకి వాళ్ళ నాన్న కొత్త ఫోన్ కొన్నాడు. అది లేకుంటే శైలు వాళ్ళ నాన్న ఏమంటాడోనని భయంతో మొబైల్ షాప్ కి తన ఫ్రెండ్ తో కలిసి వెళ్తుంది. శైలు వెళ్లి షాప్ అతన్ని మాటలో పెట్టి ఒక ఫోన్ దొంగతనం చేస్తుంది. మరొకవైపు చక్రి కోసం మహా వెయిట్ చేస్తుంది. నాకు ఎందుకు అబద్ధం చెప్పావని నిలదీస్తుంది. నేను ఏం అబద్ధం చెప్పానని చక్రి అనుకుంటాడు. మీ అన్నయ్య ఆర్కిటెక్ కాదు ఆ విషయం ఎందుకు అబద్ధం చెప్పారని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







