Home

»

Tv News

Brahmamudi : పెళ్ళి చేసుకున్న రేఖ.. అపర్ణపై పగతీర్చుకుంటుందా!

Feb 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -967 లో.....అపర్ణ ఒక్కతే ప్రాణాలతో బయటపడి ఇద్దరు మానవరాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది. సుభాష్ కి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ వచ్చి అతని స్పైనల్ కార్ట్ పాడైంది. అసలు లేవలేడని చెప్పాగానే అపర్ణ ఏడుస్తూ దేవుడికి మొక్కుకుంటుంది. అప్పుడే రేఖ వచ్చి మీరేం టెన్షన్ పడకండి ఆంటీ మీకు తోడుగా నేను ఉన్నానని అనగానే మీ అన్న మీ అమ్మ చేసిన ద్రోహం మర్చిపోను నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని అపర్ణ అంటుంది.

దీనికి ఎంత పొగరు మా వాళ్ళు లేకుండా నేను ఉండి ఏం లాభం అనుకున్నాను కానీ మా అమ్మ ఆశయం నేను నెరవేస్తాను. ఈ కుటుంబాన్ని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటానని రేఖ అనుకుంటుంది. రేఖ ఒకతని దగ్గరికి వెళ్లి నువ్వు నా వెంట చాలా రోజులు పడ్డావ్ కానీ లెక్కచెయ్యలేదు ఇప్పుడు చెప్తున్నా.. మనం పెళ్లి చేసుకుందామని రేఖ అడుగుతుంది. అప్పుడే వాళ్ళ అక్క వచ్చి మా తమ్ముడు ఒప్పుకోడని అబ్బాయి వాళ్ళ అక్క ఎంట్రీ ఇస్తుంది. మా తమ్ముడు ఎప్పుడు నాతోనే ఉండాలనుకుంటున్నాను అయితే వాడు మాతోని ఉండాలి లేదా మేం వాడితో ఉండాలని ఆవిడ అనగానే సరే మీరు అందరు నాతోనే ఉండండి. నాకు ఆ కుటుంబంపై పగ ఉంది. అది తీర్చుకోవడానికి తోడు కావాలని రేఖ అనగానే సరే ఒప్పుకుంటున్నామని వాళ్ళు అంటారు. నాకు ఇప్పుడే పెళ్లి జరగాలని రేఖ అంటుంది.

మరొకవైపు ఇద్దరి దంపతులకి స్వరాజ్ గాయలతో దొరుకుతాడు. అతన్ని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్తారు. అబ్బాయి షాక్ లో ఉన్నాడు. కొన్ని రోజులు ఆగి ట్రీట్ మెంట్ చేద్దామని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత అపర్ణ ఇంట్లో కూర్చొని జరిగింది గుర్తుచేసుకొని బాధపడుతుంది. సోఫాలో సుభాష్ ఉంటాడు. అప్పుడే రేఖ పెళ్లి చేసుకొని లోపలికి వస్తుంటే.. ఆగు అని అపర్ణ ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com