Home

»

Tv News

Jayam serial : భాను సంవత్సరికం జరగకుండా ప్లాన్ చేస్తున్న వీరు.. రుద్ర ఏం చేయనున్నాడు!

Feb 28, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -205 లో... ఇదంతా పారు, ఇషికల పని అయి ఉంటుంది. వీరుకి ఇప్పుడు ప్రీతీ ఒక ఆయుధం. తనకేం కాకుండా చూసుకోవాలి అనుకుంటాడని గంగతో రుద్ర అంటాడు. నువ్వు ప్రీతీని జాగ్రత్తగా చూసుకో.. ఆ బాధ్యత నీదే అని రుద్ర అంటాడు. మీరు అంతలా చెప్పాలా సర్ నేను చూసుకుంటానని గంగ అంటుంది. మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు, రుద్ర, పెద్దసారు, శకుంతల, ప్రమీల మాత్రమే భోజనానికి రారు.

వాళ్ళని పిలుచుకొని రావడానికి గంగ వెళ్తుంటే వద్దు వాళ్ళు రారు అని రాఘవ అంటాడు. రేపు భాను సంవత్సరికం వాళ్ళు బాధలో ఉన్నారు. నాకు గుర్తు లేదని బాధగా రాఘవ వెళ్ళిపోతాడు. రుద్ర దగ్గరికి గంగ వెళ్లి మాట్లాడుతుంది. పెద్దసారు, శకుంతల దగ్గరికి ఇందుమతి, రాఘవ వెళ్లి ధైర్యం చెప్తారు. ప్రమీల దగ్గరికి స్నేహ వెళ్లి మాట్లాడుతుంది. ఇషిక, వీరు మాత్రం మంచిగ భోజనం చేస్తారు. రేపు కుటుంబం అందరం సంవత్సరికం దగ్గరికి వెళ్ళాలని రాఘవ అనగానే రుద్ర రాకూడదని శకుంతల చెప్తుంది. రుద్ర కూడా ఈ కుటుంబమే కదా వదిన అని రాఘవ అంటాడు. అక్కడికి వస్తే నా కొడుకు ఆత్మ శాంతించదని శకుంతల అంటుంది. ఈ ఒక్కసారి మీ వదిన చెప్పినట్లు జరగనివ్వు రాఘవ అని పెద్దసారు చెప్తాడు.

ఆ తర్వాత అందరు సంవత్సరికం జరిగే దగ్గరికి బయల్దేరతారు. రుద్ర నువ్వు వద్దని రాఘవ ఇబ్బంది పడుతూ చెప్తాడు. శకుంతల అన్న మాటలు రుద్రకి రాఘవ చెప్పగానే అతను బాధపడుతాడు. ఇక రుద్ర వెళ్లకుండా ఆగుతాడు. నా భర్త రాకుండా నేను కూడా రానని గంగ ఆగిపోతుంది. ఆ తర్వాత రుద్రని వద్దని అన్నందుకే సంవత్సరికం జరగకుండా చేస్తున్నాడని శకుంతల అనుకోవాలని వీరు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com