Home

»

Tv News

ఇద్దరు సీరియల్ నటీమణులతో హైపర్ ఆది పులిహోర.. రష్మీకి  ఆదివారం బంపర్ ఆఫర్!

Jun 1, 2026 3:09PM

సీరియల్స్ పురం పేరుతో ఈ ఆదివారం ఈటీవీలో ప్రసారమైన ఎపిసోడ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందులోనూ సీరియల్స్ లో నటించేవాళ్లంతా వచ్చారు. ఇక ఆది ఐతే కొంతమంది సీరియల్ యాక్టర్స్ తో పులిహోర కలిపాడు. బెస్ట్ నెగటివిటీ రోల్ పెర్ఫార్మ్ చేయాలని హోస్ట్ రష్మీ చెప్పింది. నెగటివిటీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించాలని చెప్పింది. ఇక ఇది పెర్ఫార్మ్ చేయాలంటూ "ఆరోప్రాణం" సీరియల్ నుంచి భవాని, సంధ్యను పిలిచాడు ఆది. ఒకరి లవర్ ని ఇంకో అమ్మాయి తీసుకెళ్ళిపోయిన సీన్ ని రిక్రియేట్ చేశారు ఈ ఇద్దరు లేడీస్. ఇక ఆది ఈ లేడీస్ కి లవర్ గా వచ్చాడు. ఇక వాళ్ళు ఆదితో ఎమోషన్ కంటిన్యూ చేశారు. "రేయ్ ఎవరిని రా నువ్వు లవ్ చేస్తున్నావ్. నన్నే నువ్వు ముందు లవ్ చేసి కోడిగుడ్డు తీసుకొచ్చావ్ ...ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరకు ఎందుకు వెళ్తున్నావ్ " అని అడిగింది భవాని. "నీకు దణ్ణం పెడతా నాకు మీ ఇద్దరు అంటే ఇష్టం నాతోనే ఉండండి ప్లీజ్ " అని బతిమాలాడు ఆది. ఆది పేరును కళ్యాణ్ గా మార్చింది సంధ్య. "కళ్యాణ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా " అంటూ ఏడ్చింది. "నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా" అంటూ భావాన్ని కూడా ఏడ్చింది. ఇలా ఆది కోసం ఇద్దరు లేడీస్ ఏడుస్తూ ఉన్నారు. ఇక రష్మీ వచ్చి "ఆపండి " అంటూ అరిచింది. ఇంతమంది తన కోసం బాధపడడం చూసిన ఆది వెంటనే "సోమవారం నుంచి బుధవారం వరకు సంధ్య, బుధవారం నుంచి శనివారం వరకు భవాని ఆదివారం రష్మీ నువ్వే ఉండండి " అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దాంతో రష్మీ ఛి పో అంది. తర్వాత సింధూర, మోనికా వచ్చారు. ఆది మోనిక కూడా ఇలాగే ప్రవర్తించాడు. బులెట్ భాస్కర్ వచ్చి ఒక డైలాగ్ చెప్తుండగా మధ్యలో ఆది "నువ్వే ఏదైనా చేసుకో మా ఇద్దరికీ హనీ మూన్ టికెట్స్ వేసాక ఏదైనా చెయ్. " అన్నాడు. "బులెట్ భాస్కర్ స్థాయి ఏంటో మాకు తెలీదు కానీ మా స్థాయికి ఫ్లయిట్ కూడా అక్కర్లేదు ట్రైన్ కి వేసినా వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం బయట వర్షం పడేలా ఉంది. కనీసం పడవైనా ప్లాన్ చేయండి . అందులో వెళ్తాము " అంటూ హడావిడి చేసాడు ఆది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com