Home

»

Tv News

బిగ్‌బాస్ తర్వాత డీమన్ పవన్ కొత్త సినిమా.. మేకప్, డైలాగ్ షీట్ లేకుండానే యాక్టింగ్!

Jun 1, 2026 12:35PM

బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ డీమన్ పవన్ ఎలా ఆడాడో రీతుతో ఎలా ట్రాక్ నడిపాడో అందరికీ తెలుసు. ఇక హౌస్ లోంచి బయటకు వచ్చాక రకరకాల షోస్ చేస్తున్నాడు. ఆదివారం విత్ స్టార్ మా పరియాడ్స్ చేస్తున్నాడు. రీల్స్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు "సావిత్రి " అనే మూవీలో కనిపించబోతున్నాడు.వారం షోకి వస్తూ ఉంటాడు అలాగే కుక్కు విత్ జాతిరత్నాలు షోలో కుక్ గా ఉన్నాడు. అలాగే కొన్ని హీరో సామ్రాట్, రాను ముంబైకి రాను సాంగ్ హీరోయిన్ లిఖిత కూడా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు.

ఇక డీమన్ పవన్ కూడా మాట్లాడాడు ప్రెస్ మీట్ లో. "బిగ్ బాస్ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేయాలి ఏది చేస్తే నేమ్ వస్తుంది అని ఆలోచించుకుంటున్న టైములో డైరెక్టర్ కృష్ణ గారిని కలిసాను. అప్పుడు ఆయన ఒక క్యారెక్టర్ ఉంది సెట్ అవుతుంది అన్నారు. ఆయన కథ చెప్తూ నటించి కూడా చూపిస్తారు. ఏ యాక్టర్ కి ఐనా ఒక మంచి డైరెక్టర్ దొరకడం ఇంపార్టెంట్ . నేను అప్ కమింగ్ యాక్టర్ ని కాబట్టి ఎక్స్ప్రెస్సివ్ గా ఉండే డైరెక్టర్ దొరికితే వాళ్ళ దగ్గర నుంచి చాల నేర్చుకోవచ్చు. ఈ మూవీలో డైలాగ్ షీట్ లేదు, మేకప్ లేదు రియల్ గా నేచురల్ గా నటించాం అందరం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇన్ టైములో మూవీ తీశారు. ఇలాగే మూవీస్ తీయాలని తనకు మంచి రోల్స్ ఇవ్వాలని కోరుకున్నాడు" పవన్.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com