Home

»

Tv News

ప్రదీప్ భుజంపై తలపెట్టి  బావా అంటూ గోమతి రచ్చ.. రీతూ చౌదరి, డీమన్ పవన్ క్రేజీ కామెంట్స్!

Jun 1, 2026 3:50PM

కుక్కు విత్ జాతిరత్నాలు షో ఈ వారం ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో రెండు జోడీలు అబ్బో తెగ హడావిడి చేసేశాయి. వాళ్ళు ఎవరో కాదు డీమన్ పవన్, రీతూ చౌదరి, ప్రదీప్ - గోమతి. పవన్ వెజిటబుల్స్ కట్ చేస్తుంటే అందంగా చీరలో ముస్తాబై వచ్చిన రీతూ పవన్ ని చుట్టేసుకుని "చూసావా మా బావని ఎలా ఉంటాడో చూసి నేర్చుకోండి" అంది రీతూ గోముగా. వెంటనే పవన్ కూడా ఎం తక్కువ తినలేదు. "ఏంటే మరదలా అవుతావా నా పాలకోవా " అనేశాడు. వెంటనే రీతూ "చూసావా " అంది గోమతితో. వెంటనే గోమతి ప్రదీప్ తో "కౌంటర్ చెప్పాలి కదా మీరు చెప్పాలి కదా " అని అడిగింది. వెంటనే ప్రదీప్ కుక్కర్ మూత చూపించి కొడతాను అన్నట్టుగా ఫేస్ పెట్టి "నువ్వు చేసేది కాకుండా నువ్వు మళ్ళీ ఈవిడను చెడగొడుతున్నావా " అన్నాడు రీతుతో.  "తాను ఎలా రియాక్ట్ అయ్యాడో చూసారుగా మీరు కూడా ఒక్కసారి రియాక్ట్ అవ్వొచ్చుగా " అంటూ ప్రదీప్ తో గోముగా కామెడీ చేసింది గోమతి. "ఏ గోమతి చూసావా మా బావ ఎంత బాగున్నాడో" అంటూ గోమతిని రెచ్చగొట్టింది. "బావా నువ్వు కూడా కౌంటర్ చెప్పు ఒక్కసారి వాళ్ళు చెప్తున్నారు " అంటూ గోమతి ఏడుపు ముఖం పెట్టింది.

 వెంటనే రీతూ "మీ బావ ఎం బాలేదు మా బావే బాగున్నాడు " అని చెప్పింది రీతూ. వెంటనే ప్రదీప్ "ఆయనేం మీ బావ కాదు మా బావా " అను అంటూ చెప్పాడు. వెంటనే గోమతి "ఆయన మీ బావ కాదు ఈయన బావా " అనేసింది. రివర్స్ లో డైలాగ్ చెప్పేసరికి ప్రదీప్ తెగ నవ్వుకున్నాడు. ఇప్పుడు చెప్పు బావా అంటూ రీతూ రెచ్చగొట్టింది. గోమతి "బావా " అంటూ చుట్టేసుకుంది కానీ ప్రదీప్ ఏమీ మాట్లాడలేదు "చూడు నో రియాక్షన్ " అంటూ ఎగతాళి చేసింది కామెడీగా. "సేమ్ వాళ్ళలా రియాక్ట్ ఐతే వాళ్లకు మనకు రియాక్షన్ ఏంటి రా " అన్నాడు ప్రదీప్. "

కొత్తగా మీ పంచులు చెప్పండి " అంటూ గోమతి సతాయించింది. ఇక గోమతి బావ అంటూ ప్రదీప్ భుజం మీద తలపెట్టుకుంది. వెంటనే ప్రదీప్ "ఏంటే తింటావా పాలకోవా " అన్నాడు. దానికి గోమతి "పర్లేదు మా లవ్ లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది యాక్సెప్టెడ్ " అంది. "మనం వాళ్ళలా చేయకూడదు " అంటూ ప్రదీప్ కవర్ చేసాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com