Home

»

Tv News

సుధీర్ ని అంకుల్ అనేసిన అనన్య... విజయవాడ అమ్మాయిలంతా సింగల్ గా ఉన్నారు

May 04, 2026

సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సోషల్ మీడియాలో వీడియోస్, రీల్స్, ప్రొమోషన్స్, కొలాబరేషన్స్ చేసే  స్రవంతీ పేపకాయల , అర్దమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకున్న  అనన్య శర్మ , టిక్ టాక్ భాను, క్రిస్టెన్ రవళి వచ్చారు. ముందుగా స్టేజి మీదకు  స్రవంతీ పేపకాయల వచ్చింది. "బాబోయ్ ఏంటి లైట్ లతో తెగ కొట్టేత్తన్నారు. మీతో మాట్లాడాలా లైట్ లను లెక్కెట్టుకుంటూ కూర్చోవాలా " అంటూ గోదారి యాసలో మాట్లాడేసరికి సుధీర్ నవ్వేసాడు. "ఏ ఊరు మనది" అని అడిగాడు. "సామాల్కోట్ దగ్గర మేడపాడు" అని చెప్పింది.

నాకెందుకో మీరిక్కడ ఉంటే కాసేపు చూడాలనుంది" అన్నాడు సుధీర్. "నన్ను నించోబెట్టి ఇంకెంతమందిని నిల్చోబెడతావక్కడ " అంటూ విష్ణు సుధీర్ ని గసిరేసింది. విష్ణు ప్రియా కూడా గోదారి యాసలో మాట్లాడేసరికి "మీది కూడా  మేడపాడేనా" అని అడిగాడు. "చెప్పులు ఇక్కడ పెడతాను దొబ్బేయరు కదా " అని సుధీర్ ని అడిగింది శ్రవంతి. "చూడు నీవల్ల ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో" అంటూ సుధీర్ విష్ణు ప్రియను అనేసరికి "నాకు ఆ పిల్ల మీద కాదు మీ మీదనే డౌట్" అనేసరికి విష్ణు నవ్వేసింది. తర్వాత అనన్య శర్మ వచ్చింది. "వెబ్ సిరీస్ లో మీకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకున్నారు కదా మరి రియల్ లైఫ్ లో" అని సుధీర్ ఆమెను అడిగాడు. "లేదు ఏజ్ ఈజ్ ఏ జస్ట్ ఏ నంబర్ " అంది. వెంటనే స్రవంతి "అయన్నీ నమ్మావంటే కన్నాలేసుకుని బతకాలి నీ ప్యాంటు లాగే" అనేసింది. "ప్రాబ్లమ్ ఏమీ లేదు అని అంటున్నారు అంతేకదా " అని సుధీర్ అనేసరికి. "అలాంటి వాళ్ళు మీకెవరన్నా తెలిస్తే  నాకు చెప్పండి అంకుల్" అనేసింది.

అంతే సుధీర్ షాకైపోయాడు. తర్వాత టిక్ టాక్ భాను వచ్చింది. "మాది విజయవాడే మీది విజయవాడే మనది విజయవాడే . అందం అంటే విజయవాడ. విజయవాడలో అమ్మాయిలు ఎలా ఉన్నారు " అని అడిగాడు సుధీర్. "సింగల్ గా ఉన్నారు" అని చెప్పింది. "ఎందుకు" "ఉన్న ఒక్క అందగాడు హైదరాబాద్ లో ఉంటే విజయవాడలో అమ్మాయిలంతా సింగల్ గానే ఉంటారు కదా " అంది భాను. "మరి హైదరాబాద్ లో అబ్బాయిలంతా ఎలా ఉన్నారు " అని అడిగింది భాను. "అందరూ సింగల్ గానే ఉన్నారు. ఉన్న ఒక్క అందగత్తె విజయవాడలో ఉండిపోతే ఇక్కడ అబ్బాయిలకు ఎవరు దొరుకుతారు" అంటూ కౌంటర్ ఇచ్చాడు సుధీర్.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com