కాలేజ్ ఫన్, ఫ్రెండ్షిప్, యూత్ ఎమోషన్స్ కలగలిపిన ఎంటర్‌టైనర్ ‘బ్యాచ్‌మేట్స్’ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌లు విడుదల అవుతాయి. ‘బ్యాచ్‌మేట్స్’ కథ సిద్, స్యామీ, మిల్కీ, గోల్డీ అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. కాలేజ్ లైఫ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన వీరి ప్రయాణంలో జరిగే సరదా సంఘటనలు, క్యాంపస్ ఫ్రెండ్షిప్స్, క్రష్‌లు ఇలా యూత్ లైఫ్‌లోని అన్ని కలర్స్ ను ఈ సిరీస్ హాస్యభరితంగా, సహజంగా చూపించారు.
వైవిధ్యమైన కాలేజ్ నేపథ్యంలో సాగుతున్న ఈ కథ, స్నేహం విలువను, చిన్న చిన్న జ్ఞాపకాలను, యువతలో ఉండే ఉత్సాహాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. కొత్త సంబంధాలు, అనుకోని సమస్యలు, సరదా క్షణాలు – ఇవన్నీ కలిసి సిద్, స్యామీ, మిల్కీ, గోల్డీ జీవితాన్ని మరింత కలర్ ఫుల్ చేస్తాయి.
లైట్ హార్ట్ టోన్, ఎంగేజింగ్ స్టోరీటెల్లింగ్, రిలేటబుల్ క్యారెక్టర్స్‌తో ‘బ్యాచ్‌మేట్స్’ ప్రతి ఒక్కరినీ తమ కాలేజ్ రోజులు గుర్తు చేసుకునేలా చేస్తుంది.‘బ్యాచ్‌మేట్స్’ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్‌లను మిస్ అవ్వకండి.





