
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -259 లో... గంగకి సుధా కాల్ చేసి మాట్లాడుతుంది. ఏం చేస్తున్నావని అడిగినందుకు తను చేసిన పనులు చెప్తుంది. ఈ రోజు గుడికి రా అని సుధా అడుగగా గంగ సరే అంటుంది.
ఆ తర్వాత గంగ దగ్గరికి పెద్దసారు వచ్చి.. ఎవరితో మాట్లాడావని అడుగుతాడు. సుధా అమ్మగారు అని గంగ చెప్పగానే పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మగారు గుడికి రమ్మంటున్నారని గంగ చెప్పగానే నేను కూడా వస్తానని పెద్దసారు అంటాడు.
మరొక వైపు ధీరజ్ కి విశ్వ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయిస్తాడు. అప్పుడే కోపంగా రుద్ర వస్తాడు. ఏంటి రుద్ర కోపంగా ఉన్నట్టున్నావ్.. మా పెద్దనాన్నని ఎందుకు అవమానించావని అడగడానికి వచ్చావా అని విశ్వ అనగానే లేదు వయసులో పెద్దవారు అయి ఉండి సమాజంలో గౌరవ మర్యాదలున్న వ్యక్తితో అలాగేనా మాట్లాడేది అని రుద్ర అంటాడు. నేను అన్నీ అన్నా కూడా మీ పెద్దనాన్న ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు.. ఏం తప్పు చేశాడు.. ఆ విషయం మీ పెద్దనాన్నని అడుగు.. అంత జరిగినా నీకు ఎందుకు చెప్పలేదని విశ్వ అంటాడు. మీ పెద్దనాన్నని అడిగి నా దగ్గరికి రా అప్పుడు సమాధానం చెప్తానని విశ్వ అనగానే కోపంగా రుద్ర వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు.
మరొకవైపు గంగ, పెద్దసారు ఇద్దరు గుడికి వెళ్తారు. అక్కడికి సుధా రావడంతో పెద్దసారు పక్కన చాటున ఉండి చూస్తాడు. గంగని తను వచ్చినట్లు చెప్పొద్దని అంటాడు. ఆ తర్వాత సుధా వచ్చి మా అన్నావదినల షష్ఠి పూర్తి ఉంది.. వాళ్ళు బాగుండాలని దేవుడి పేరున అర్చన చెయ్యండి అని పంతులుగారితో సుధా చెప్తుంది. మీ అన్నయ్య అంటే ఇష్టమా అని గంగ అనగానే చాలా ఇష్టమని సుధా చెప్తుంది. అదంతా పెద్దసారు వింటాడు.
మరొకవైపు శకుంతల గుడికి బయల్దేర్తుంది. పెద్దసారుని శకుంతల పిలిస్తే అతను ఉండడు.. వాళ్ళు గుడికి వెళ్లారని ఇందుమతి చెప్తుంది. నాకు చెప్పకుండా వెళ్ళారా అని శకుంతల కోపంగా ఉంటుంది. మనం వెళదాం అత్తయ్య అని ఇషిక అంటుంది. ఇక శకుంతల, ఇషిక ఇద్దరు బయల్దేరతారు. ఆ తర్వాత ఇషిక మెల్లగా శకుంతల ఆడపడుచు గురించి అడుగుతుంది. ఇంకొకసారి తన గురించి తియ్యొద్దని ఇషికపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత నేను గుడికి వచ్చినట్లు రుద్ర సర్ కి చెప్పలేదని గంగ పక్కకి వెళ్లి ఫోన్ చేస్తుంది.
తరువాయి భాగంలో పెద్దసారు, సుధా మాట్లాడుకుంటారు. రుద్రకి తన మేనత్త సుధా అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





