.webp)
సర్కార్ లేటెస్ట్ ఎపిసోడ్ లో సుధీర్ పెళ్లి మీద గెస్టులుగా వచ్చిన అలీ, శివాజీ కామెంట్స్ చేస్తే దానికి కామెడీ కౌంటర్లు ఇచ్చారు మాస్ పొలిటికల్ లీడర్ మల్లారెడ్డి."సర్ 50 వ పెళ్లి సెలెబ్రేషన్స్ చూసాకా నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించింది అన్నాడు సుధీర్. "ఇంత వయసొచ్చాక కూడా పెళ్లి చేసుకోకుండా ఎందుకువయ్యా నువ్వు " అని కామెంట్ చేశారు మల్లారెడ్డి. "సర్ మీరు మాట్లాడుతుంటే తిడతన్నట్టుగా ఉంది " అన్నాడు సుధీర్. "సర్ మీరేదో నాకు పర్సనల్ గా చెపుదామనుకుంటున్నారో చెప్పండి " అని సుధీర్ అనేసరికి "నేను జపాన్ పోయినా అక్కడ ఎవరూ పెళ్లిళ్లు చేసుకోవడం లేదు...చేసుకున్నా పిల్లల్ని కనడం లేదు . నువ్వు కూడా అదే మోడల్ లా జపాన్ టెక్నాలజీలోకి వెళ్ళిపో " అన్నారు మల్లారెడ్డి. "ఇతని దగ్గర అన్ని టెక్నాలజీలు ఉన్నాయి సర్ " అన్నాడు శివాజీ. "అసలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా సర్ పెళ్లి చేసుకుంటే " అని మళ్ళీ సుధీర్ అడిగాడు. "పనిరానికి వాళ్లకు ప్రాబ్లమ్స్ ఉంటాయి."అన్నారు మల్లారెడ్డి. "నా వైపు చూపించారేంటి " అనేసరికి "నీ వైపే ఎందుకంటే మాకు పెళ్లిళ్లు ఐపోయాయి కదా " అన్నాడు అలీ. "పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది
ఎలా హ్యాపీగా ఉండాలి చెప్తే తప్పకుండా ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటా" అన్నాడు సుధీర్. "నా పెళ్లయ్యే టైంకి నేను పాలు అమ్మేవాడు. పెళ్లయ్యాక నేను సక్సెస్ అయ్యాను. ఈరోజు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను అంటే ఇద్దరం కలిసే కదా. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి.
అవన్నీ అధిగమిస్తేనే కదా ఈరోజు ఇక్కడి వరకు వచ్చాము. అందుకే మీ యూత్ కి ఆదర్శంగా ఉండాలనే నేను నా 50 ఇయర్స్ మ్యారేజ్ గోల్డెన్ జూబ్లీని అంత గ్రాండ్ గా చేసుకున్నాను" అన్నారు మల్లారెడ్డి. "నువ్వు పెళ్లి చేసుకో.నీ పిల్లలకు ఆయన కాలేజ్ లో ఫ్రీ సీట్ ఇస్తారు " అన్నాడు అలీ. "అవన్నీ ఎం లేవు. అది గవర్నమెంట్ ది కాదు." అన్నారు మల్లారెడ్డి. "మీ మాట విని పిల్లల్ని కంటున్నాడుగా కనీసం ఒక మాట ఇవ్వన్నా " అన్నాడు అలీ. "ఫ్రీ సీట్ల కోసం పిల్లల్ని కంటాడా ఆయన" అన్నారు మల్లారెడ్డి. "రీసెంట్ గా పెళ్లయ్యింది కాబట్టి ఈ షో ద్వారా మేడంకి ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఎం చెప్తారు " అని సుధీర్ అడిగాడు.
"భార్యకి కొత్తగా ఎం చెప్తార్ర. ఇంట్లో చెప్తారు కానీ ఏడ బడితే ఆడ చెప్తార్ర.. లైఫ్ పార్టనర్ తప్పనిసరిగా ఉండాలి " అని కామెడీగా అడిగారు మల్లారెడ్డి. " "ఈ కాలంలో అబ్బాయిలు " అని విష్ణు ప్రియా అనేసరికి "అమ్మాయిలేమన్నా సరిగ్గా ఉన్నారా చెప్పు " అని కౌంటర్ ఇచ్చారు.




.webp)
.webp)
