Home

»

Tv News

తిరుమల శ్రీవారి సన్నిధిలో సాయికిరణ్ ముద్దుల తనయుడు రణ్‌వీర్ రామ్ మొదటి పుట్టినరోజు వేడుక

Nov 20, 2026 9:34AM

సిల్వర్ స్క్రీన్ మీద నువ్వే కావాలి, ప్రేమించు లాంటి మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ గురించి అందరికీ తెలుసు. అలాగే బుల్లితెర మీద కోయిలమ్మ, గుప్పెడంత మనసు సీరియల్స్ ద్వారా కూడా తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.  అలాంటి సాయి కిరణ్ కోయిలమ్మలో కలిసి నటించిన స్రవంతిని 2024 లో  పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్లకు ఒక బాబు పుట్టి ఏడాది అయ్యింది. అతని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. అది కూడా శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో. ఆ పిక్స్ ని సాయి కిరణ్ - స్రవంతి వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేసుకున్నారు.

" మా ముద్దుల తనయుడు రణ్‌వీర్ రామ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కోరుతూ స్వర్ణగిరిలో ఈ వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకున్నాం.  మా జీవితాల్లోకి నువ్వు అడుగుపెట్టినప్పటి నుంచి ప్రేమ, ఆనందం, వెలుగులు నిండిపోయాయి. అమ్మను కాబోతున్నానని తెలిసిన ఆ క్షణం నా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన వార్త. తొమ్మిది నెలల పాటు నిన్ను నా కడుపులో మోస్తూ, ఎప్పుడెప్పుడు నిన్ను నా చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంటానా అని ఎన్నో కలలు కన్నాను. నా బుజ్జి కొడుకా.. దేవుడు నాకు ఇచ్చిన అపురూపమైన కానుకవి నువ్వు. నీ చిరునవ్వు నా ప్రతి రోజును అందంగా మారుస్తోంది. నీ రాకతో మా జీవితాల్లో కొత్త సంతోషాలు మొదలయ్యాయి. నిన్ను మొదటిసారి చేతుల్లోకి తీసుకున్న నిన్న మొన్నటి క్షణాలే ఇంకా కళ్లముందు మెదులుతున్నాయి. అప్పుడే ఏడాది గడిచిపోయింది. శ్రీవేంకటేశ్వర స్వామి  ఆశీస్సులతో నువ్వు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. నీ జీవితం ప్రేమతో, ఆనందంతో, విజయాలతో నిండిపోవాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు నా రాముడూ...!   నువ్వే మా ప్రపంచం.. నువ్వే మా ఆనందం.. నువ్వే దేవుడిచ్చిన గొప్ప వరం!  "

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com