
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ సీరియల్ కి రెండు సీరియల్స్ వాళ్ళు వచ్చేసారు. అదే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వెర్సెస్ ఏ దేవి వరము నీవో . "మీరు సీరియల్ షూటింగ్ ప్రాసెస్ లో ఆడియన్స్ కి తెలియని కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను హాష్ ట్యాగ్స్ రూపంలో మీరు వాళ్లకి ఇస్తూ ఉండాలి." అని చెప్పింది శ్రీముఖి. అన్షు రెడ్డికి డర్టీ మైండెడ్ అనే హ్యస్ టాగ్ వచ్చింది. దాంతో శ్రీముఖి అడిగింది "అంటే నా చుట్టుపక్కల ఉండడం వలన " అని చెప్పింది. వెంటనే శ్రీముఖి "నితిన్, సాగర్ తో ఫ్రెండ్ షిప్ చేయడం వలన ఆవిడ అది ఐపోయింది " అని చెప్పింది.
ఇక సాగర్ కి "అడుక్కునే వాడికి అడుక్కునే వాడు " అనే హ్యస్ టాగ్ ఇచ్చింది. "నువ్వు సాగర్ ని అలాంటి మాట ఎందుకు అన్నావ్ అని అన్షు రెడ్డిని అడిగింది. "అంటే మొహమాటానికి నేను ఇలా తింటున్నా అతను నన్నే చూస్తూ ఉంటాడు. సరే మొహమాటానికి ఒక్కటి ఇస్తే మొత్తం తినేస్తాడు ఇంకా తిరిగి నాది నాకు కూడా ఇవ్వడు " అని చెప్పింది అన్షు రెడ్డి. ఇక శ్రవణ్ వచ్చి హ్యాష్ టాగ్ స్నిజింగ్ అని రాసి ఏ దేవి వరము నీవో సీరియల్ హీరోయిన్ సోనియా మేడలో వేసాడు. "నా లైఫ్ లో అన్ని సార్లు తుమ్మడం నేను చూడలేదు. యావరేజ్ గా ఒక సీన్ కె 150 నుంచి 200 సార్లు తుమ్ముతుంది i" అన్నాడు. ఎందుకు అని సోనియాని శ్రీముఖి అడిగింది. "నాకు డస్ట్ ఎలెర్జి " ఉంది అని చెప్పింది. వెంటనే హరి "సో స్వీట్ అన్నాడు " దానికి శ్రీముఖితో పాటు అందరూ నవ్వేశారు.




.webp)
.webp)
