Home

»

Tv News

వార్నింగ్ ఇచ్చిన అమూల్యనే వివాహం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ బాబు

Nov 20, 2026 9:29AM

బాబు డేగల ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తీసిన బాబు జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా స్కిట్స్ చేస్తూ ఉంటాడు. బాబుకి జోడిగా శ్రీవిద్య కూడా మంచి కామెడీ పండిస్తూ ఉంటుంది. జబర్దస్త్ నుంచి  ఎంతోమంది కమెడియన్స్ హీరోలుగా డైరెక్టర్ లుగా మారారు. అందులో డేగల బాబు కూడా ఒక వ్యక్తి. అలాంటి బాబు ఇప్పుడు తన పెళ్లి విషయాన్నీ రివీల్ చేసాడు. ఆ అమ్మాయి వివరాలు ఏంటంటే ఆమె పేరు అమూల్య. బిఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్ లో యాంకర్ గా పని కూడా చేసింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆమెకు బాబు అంటే ఎంతో ఇష్టం కూడా. ఆమె ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా బాబుకి ఎంతో సాయం కూడా చేసిందని కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చాడు. ఒక్క మూవీ ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాకే పెళ్లి చేసుకుందాం అనుకున్న బాబు ఇప్పుడు లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తీసి సక్సెస్ అయ్యాడు. దాంతో ఇక అమూల్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు.

గతంలో ఒక విషయంలో బాబుకి గట్టిగా వార్నింగ్  ఇచ్చిన అమూల్యతో ఇప్పుడు ఏడడుగులు వేయబోతున్నాడు. ఇక బాబు పెళ్లి వేడుకకు బుల్లితెర పెర్ఫార్మెర్స్ అంతా వచ్చారు. నూకరాజు, పంచ్ ప్రసాద్, సునీత, టేస్టీ తేజ, జిత్తు , సందీప్  వంటి వాళ్లంతా వచ్చారు. "ఫైనల్ గా మా బాబు ఒక ఇంటి వాడు అయ్యాడు కంగ్రాట్యులేషన్స్ బాబు " అని చెప్పాడు తేజ. ఇక టేస్టీ తేజ సెలెబ్రేషన్స్ అండ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా బాబు పెళ్లి జరగడం చాల సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు తేజా. ఇక నెటిజన్స్ అంతా కూడా బాబుకు విషెస్ చెప్తున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com