Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!
on Dec 19, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.
శ్రీవల్లికి ఇంగ్లీష్ టీచర్ గా జాబ్ ఇప్పిస్తాడు. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. కంగ్రాట్స్ అక్క అని ప్రేమ, నర్మద ఇద్దరు శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటారు. మాతో ఎన్నిసార్లు ఆడుకున్నావని ప్రేమ, నర్మద అంటారు. ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు ఇద్దరిని శ్రీవల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి కొడుతుంది. మరొకవైపు నాకు రాత్రి ఎందుకు ముద్దు పెట్టావ్ రా అని ధీరజ్ నిద్ర లేచేసరికి తన ముందు గొడ్డలి పట్టుకొని ఉంటుంది శ్రీవల్లి. ఏమో.. ఏం జరిగింది.. నాకు గుర్తులేదని ధీరజ్ అంటాడు. అసలు ఏం జరగలేదని మర్చిపోయి నార్మల్ గా ఉండమని ధీరజ్ అంటాడు. నేను వదిలిపెట్టనురా అని ప్రేమ అనుకుంటుంది.
ఆ తర్వాత సాగర్ ఇన్ షర్ట్ వేసి వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నావ్ రా వెళ్ళేది రైస్ మిల్ కి.. అలా వెళ్లడం అవసరమా అని రామరాజు కోప్పడతాడు. దాంతో సాగర్ వెళ్లి నార్మల్ డ్రెస్ వేసుకొని వస్తాడు. ఇక అతను వెళ్తుంటే రామరాజు పిలుస్తాడు. ఈ డబ్బులు కృష్ణారావుకి ఇవ్వమని రామరాజు ఇస్తాడు. దాంతో సాగర్ కోపంగా తీసుకుంటాడు. మీ నాన్నది కోపం కాదురా అని వేదవతి కూల్ చెయ్యాలని ట్రై చేస్తుంది. ఏవండి.. అదంతా కామన్ కానీ మీరు వెళ్ళండి అని నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. అదంతా విన్న శ్రీవల్లి వాళ్ళ మధ్య గొడవ పెట్టాలని ట్రై చేస్తుంది. పాపం నర్మద మీరు రైస్ మిల్ లో పని చేస్తున్నారని రోజు బాధపడుతుందని సాగర్ కి చెప్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



