Home

»

Tv News

Jayam serial : ప్రమీలకి సూపర్ మార్కెట్ భాద్యతలు.. వీరు ఏం చేయనున్నాడు!

Mar 06, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -209 లో.....ప్రమీలకి ఇంట్లో జరుగుతున్న అన్యాయం రుద్రతో గంగ చెప్తుంది. దాంతో ప్రమీలకి పెళ్లి చెయ్యాలని రుద్ర అనగానే దానికి అమ్మగారు ఒప్పుకోరని గంగ అంటుంది. ముందు ప్రమీలకి సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగించాలి. తనకి బయట ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుందని రుద్ర అంటాడు. గంగ, రుద్ర, రంగ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. బావ నువ్వు చెప్పింది చెయ్యడానికి ఈ బామ్మర్ది ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడని రుద్రతో రంగా అంటాడు.

ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే కావాలనే గంగ మాట్లాడుతుంది. ప్రమీల అక్క నువ్వు వెళ్లి కిచెన్ క్లీన్ చెయ్ అని గంగ అంటుంది. ఇక దానికి గంగ నీకు ప్రమీల ఎలా కన్పిస్తుంది.. తనకి పని చెప్తున్నావ్.. తను ఈ ఇంటికి నీ కంటే ముందు కోడలుగా వచ్చిందని రుద్ర అంటాడు. ఇలా తను ఇంట్లో పనులకి పరిమితం కాకుడదు.. అంటూ ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. తనే సూపర్ మార్కెట్ ని చూసుకుంటుందని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. నేను నిర్ణయం తీసుకున్నానని రుద్ర అంటాడు. అదేంటి తను సూపర్ మార్కెట్ చూసుకోవడమేంటని శకుంతల అంటుంది. తనకి అన్ని తెలుస్తాయి కదా వెళ్లనివ్వు అని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఇషిక, వీరు పక్కకి వచ్చి మాట్లాడుకుంటారు. ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తుందంటే వద్దని అందరి ముందు గట్టిగా అరవాలనిపించిందని వీరు అంటాడు.

ఆ తర్వాత సూపర్ మార్కెట్ కి వెళ్ళడానికి ప్రమీలని గంగ, స్నేహ రెడీ చేస్తుంటే.. ఇషిక వస్తుంది. అక్కకి ఏం తెలుసని సూపర్ మార్కెట్ కి పంపిస్తున్నారని ఇషిక అడుగుతుంది.  ముందు నీకు ఏం తెలుసు.. మెల్లిగా అన్ని నేర్చుకున్నావు కదా.. అక్క కూడా అంతే అని గంగ అంటుంది. ఇక ప్రమీలని గంగ మోటివేట్ చేస్తూ ఒక వాచ్ పెడుతుంది. తనకి గుడ్ టైమ్ రావాలని కోరుకొని పెద్దసారు, శకుంతల ఆశీర్వాదం తీసుకోమంటుంది గంగ. కానీ వారికంటే ముందు ఒకరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుంటుంది ప్రమీల. కాసేపటికి రుద్ర దగ్గరికి ప్రమీల వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. మీరు నా గురించి అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు బావ గారు చాలా థాంక్స్ అని ప్రమీల అంటుంది. పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోమని ప్రమీలతో రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర దగ్గరికి గంగ వస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే రంగ వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com