
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -64 లో.....కన్నా వెళ్ళిపోయాక మహా ఇంట్లో నుండి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కన్నా ఎగ్జామ్ కి టైమ్ అవుతుంది అని మాధవ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత మహా దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతుంటే.. ఎందుకని మహా అంటుంది. మీరు ఇంటికి వచ్చినప్పటి నుండి ఇల్లంతా సందడిగా ఉంది.. మా అమ్మ అయితే చెప్పి వెళ్తాను కదా అని కన్నా అంటాడు. వదిన వచ్చాక ఎగ్జామ్ ఎలా రాసానో చెప్తాను.. మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొని వస్తానని కన్నా అంటాడు. కన్నా వెళ్ళిపోయాక మహా కూడా వెళ్ళడానికి సిద్ధమవుతుంది.
నేను డ్రాప్ చేస్తానని చక్రి చెప్తాడు. మహా వెళ్లిపోతుంటే మాధవ బాధపడుతాడు. మహాని తీసుకొని చక్రి వెళ్ళిపోతాడు. చక్రి హుషారుగా పాట పాడుతూ బండి నడుపుతాడు. ఏంటి ఇంత హుషారుగా ఉన్నారని మహా అంటుంది. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని మహా అంటుంది. ఆ తర్వాత మహా ఆగమని చెప్తుంది. ఏంటి నేను అడ్రెస్ చెప్పకుండా డైరెక్ట్ ఇక్కడికి తీసుకొని వచ్చారని మహా అనగానే నిన్న చెప్పారు కదా అని చక్రి చెప్తాడు. మహా వెళ్లిపోతుంటే సరే వెళ్లిపోండి అన్నట్లు చక్రి ఉంటాడు. మహా వెళ్లి ఓనర్ తో మాట్లాడుతుంది. రూమ్ లేదు అమ్మ మా ఆవిడా తరుపున వాళ్ళకి ఇచ్చామని మహా ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇస్తాడు. మహా అతన్ని తిట్టి తిరిగి వెనక్కి వెళ్తుంది. అక్కడే ఉండి ఫోన్ మాట్లాడుతున్న చక్రి దగ్గరికి మహా వెళ్తుంది. ఏంటి అండి ఏదైనా మర్చిపోయారా అని చక్రి అంటాడు. వాడు రూమ్ ఎవరికో ఇచ్చేసాడు అంట.. నాకు మీ మీద డౌట్ గా ఉంది.. మీరు వాడిని ఏమైనా బెదిరించారా అని మహా అంటుంది. ఇప్పుడే వాడి దగ్గరికి పదండీ అని మహాని తీసుకొని చక్రి ఓనర్ దగ్గరికి వెళ్తాడు.
ఓనర్ కి చక్రి సైగ చేసి ఏం చెప్పొద్దూ అనడంతో ఎవరు మీరు రూమ్ వేరే వాళ్లకు ఇచ్చాను కదా అన్నట్లు మాట్లాడుతాడు. ఇప్పుడు అర్ధం అయిందా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని చక్రి అంటాడు. ఆ తర్వాత పదండి మా ఇంటికి అని చక్రి అంటాడు. నేను రాలేను అని మహా అంటుంది. అయినా తనని తీసుకొని ఇంటికి బయల్దేరతాడు చక్రి. మరొకవైపు వదిన ఎక్కడ అని కన్నా అడుగుతాడు. వదిన, చక్రి బ్యాగ్ తో వెళ్లారట అని కేశవ అంటాడు. అవునా అన్నయ్య అని కన్నా అడుగుతాడు. మాధవ అసలు విషయం చెప్పబోతుంటే మహాని తీసుకొని చక్రి వస్తాడు. ఎక్కడికి వెళ్ళారని కన్నా అడుగగా వదిన బట్టలు ఇస్త్రీకి ఇవ్వడానికి అని చక్రి కవర్ చేస్తాడు. ఆ తర్వాత సారీ పెద్ది.. మీరు వద్దని అంటున్నా వెళ్ళాను.. మీ పర్మిషన్ లేకుండా మళ్ళీ వచ్చానని మహా అంటుంది అలా ఎవరైనా చిన్న విషయానికి సారీ చెప్తారా అని మాధవ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







