Home

»

Tv News

Karthika Deepam2 : కార్తీక్ ని నిలదీసిన కాంచన.. నిజం చెప్తాడా!

Mar 06, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -610 లో..... కార్తీక్, దీప బ్యాగ్ తో హాల్లోకి వస్తారు. ఎక్కడికి అని కాంచన అడుగుతుంది. దీప కడుపుతో ఉంది కదా.. తనకి ఇష్టమైన ప్లేస్ లో చూపించడానికి అని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ దశరథ్ ని తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. అంటే నువ్వు మాకు చెప్పింది అబద్ధమా.. నా భార్యకి రెస్ట్ కావాలి లీవ్ ఇవ్వండి అన్నావని శివన్నారాయణ అంటాడు. రెస్ట్ కోసమే కానీ నా ఫ్రెండ్ ఒకరు ఇలా సజెస్ట్ చేసాడు అందుకే అని కార్తీక్ అంటాడు.

అంతా అబద్ధం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసని కాంచన అనగానే అసలు ఈ పారు ఏం చెప్పిందోనని కార్తీక్ టెన్షన్ పడుతాడు.మీరు వెళ్తుంది హాస్పిటల్ కి  అవునా అని కాంచన అనగానే కార్తీక్ ఏం చెయ్యలేక అవునని చెప్తాడు. ఎందుకో తెలుసా.. దీపకి నా కొడుకు ప్రతిరూపం తన కడుపులో పెరగడం ఇష్టం లేదు వదిలించుకుందామని చూస్తుందని కాంచన అనగానే అందరు షాక్ అవుతారు. దీపని అనసూయ తిడుతుంటే దశరథ్ కి కోపం వచ్చి దీప గురించి ఒక్క మాట అనడానికి లేదు.. అసలు తన గురించి మీకేం తెలుసు.. అసలు నిజం నేను చెప్తానని దశరథ్ అంటాడు. మరొకవైపు కాశీకి స్వప్న కాఫీ తీసుకొని వచ్చి తీసుకోండి డ్రైవర్ గారు అంటుంది. ఏంటే అలా మాట్లాడుతున్నావని కావేరి అడుగుతుంది. నిన్నటి వరకు అంటే కాశీ నా భర్త కానీ ఇప్పుడు విడాకులు అయ్యాయి కదా.. ఇప్పుడు డ్రైవర్ అని స్వప్న అంటుంది. ఈ మనసులో ప్రేమ ఒక్కరికే ఉంటుంది. అది నా ప్రేయసికే మళ్ళీ ప్రేమిస్తానని కాశీ అంటుంటే స్వప్నకి ఏం అర్థం కాదు.

మరొక వైపు జ్యోత్స్నకి పారిజాతం నిజం చెప్తుంది. దీప కడుపు లో బిడ్డని వదులుకోవాలనుకుంటుంది అని పారిజాతం చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. తన మనసులో చాలా డౌట్స్ వస్తాయి. అన్ని క్లారిటీ తీసుకోవాలని జ్యోత్స్న అక్కడ నుండి వెళ్తుంది. మరొకవైపు దీప ఎందుకు అలా చేస్తుందో దశరథ్ చెప్పబోతుంటే తనని ఆపడానికి మావయ్య నా భార్య గురించి నీకేం అధికారం ఉందని కార్తీక్ అంటాడు. ఏంట్రా అధికారం అంటున్నావని శివన్నారాయణ కోప్పడతాడు. నాకు అధికారం ఉంది కదా చెప్పు దీప బిడ్డని ఎందుకు వదులుకోవాలనుకుంటుందోనని శివన్నారాయణ, శ్రీధర్ అడుగుతారు. చెప్పు దీప అని కాంచన అనగానే బిడ్డని కాపాడుకోవాలా తల్లిని కాపాడు కోవాలా అనే సిచువేషన్ వస్తే ఏం చేస్తావ్ అమ్మ అని కాంచనని కార్తీక్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com