Home

»

Tv News

రోజాకి బెస్ట్ సహనశీలి అవార్డు...టామ్ అండ్ జెర్రిలా అనిల్ - సుధీర్

Jul 28, 2026 10:30AM

డ్రామా జూనియర్స్ సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ఎపిసోడ్ కి మహేంద్రగిరి వారాహి టీమ్ టీమ్ నుంచి సుమంత్ వచ్చారు. సుధీర్ ఐతే అందరూ నిజాలే మాట్లాడుకోవాలి అంటూ ఒక కండిషన్ పెట్టాడు. దానికి రోజా నాకు ఓకే నీకు ఒకే నా అనేసరికి సుధీర్ బుంగ మూతి పెట్టాడు. "మీరు నా యాంకరింగ్ అవన్నీ చూస్తా ఉంటారా సర్ " అని సుధీర్ అడగగానే "నాన్సెన్స్ " అంటూ అక్కినేని నాగేశ్వరావు ఎక్స్ప్రెషన్స్ తో అదే మాడ్యులేషన్ తో చెప్పారు.

ఇక లాస్ట్ సీజన్ లో అనిల్ మామ అంటూ అలరించిన ఈర్య కూడా ఈ షోలో కనిపిస్తోంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ సీజన్ లో దుమ్ము దులుపుతున్న శ్రీవియాతో కలిసి చేస్తోంది. "ఏంటే ఇంతున్నావ్ ..ఎగిరెగిరి పడుతున్నావ్ " అంటూ ఈర్య వెటకారంగా అనేసరికి "నువ్వేమైనా అంతున్నావా నువ్వు కూడా ఇంతేగా ఉన్నావ్" అంటూ శ్రీవియా కూడా ఈర్య మీద ఫైర్ అయ్యింది.  ఇందులో మరో చైల్డ్ ఆర్టిస్ట్ హార్వీన్ రెడ్డి కూడా గిటార్ పట్టుకుని వచ్చాడు. ఆ పిల్లాడిని చూసేసరికి అనిల్ రావిపూడి తలపట్టుకుని మళ్ళీ వచ్చావా అన్నారు. "మగాడు ఈజ్ బ్యాక్ " అంటూ టైటిల్ వేశారు. అనిల్ గాడు అంటూ ముద్దుగా పిలిచాడు. అనిల్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ నవ్వారు.

ఇక నెటిజన్స్ ఐతే ఈ ప్రోమో కింద బోలెడన్ని కామెంట్స్ పెట్టారు. అందులో ఎక్కువ శాతం " అనిల్ రావిపూడి గారు సుధీర్ అన్న కాంబినేషన్ పిల్లల కామెడీ సూపర్ హిట్... టామ్ అండ్ జెర్రీ  మనుషులు ఐతే.. అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్ లా ఉంటారేమో అన్నట్టు ఉంటుంది.. వీరి కాంబినేషన్... అనిల్ రావిపూడి సుధీర్ అన్న కామెడీ ఇచ్చి పడేస్తున్నారు...  అని ఇద్దరినీ తెగ పొగిడేస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com