Home

»

Tv News

Godhavari : నిత్య పిచ్చి ప్రేమ.. జాను సంచలన సవాల్!

Jul 29, 2026 9:33AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -68 లో.....నాన్న చావుకి కారణం ఆ సింహాద్రి అని జాను అనగానే నోరు ముయ్ అన్నం పెట్టిన చేతిని నరకాలని చూస్తున్నావ్ .. పెళ్లిలో చేసిన గొడవ చాలదా అని శారద కోప్పడుతుంది. పెళ్లి విషయంలో జాను చేసింది తప్పే కావచ్చు కానీ ఈ విషయంలో తనే రైట్ అనిపిస్తుందని నందు అనగానే థాంక్స్ అక్క నాకు కొండంత దైర్యంగా ఉందని జాను అంటుంది.

ఆ తర్వాత శారద గట్టిగా అరుస్తుంటే కిన్నెర భయపడుతుంది. తనని గౌతమి లోపలికి తీసుకొని వెళ్తుంది. అమ్మ ఆ సింహాద్రి నిజస్వరూపం బయటపెడతానని జాను ఛాలెంజ్ చేస్తుంది. మరొకవైపు  తుఫాన్ కి సూర్య డ్రింక్ ఇస్తాడు. మా మావయ్య వాళ్ళు ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారని సూర్య అంటుంటే మీరేం కంగారు పడకండి బాబు ఆ నిత్య అమ్మ ఆల్రెడీ ఎవరితోనో లవ్ లో ఉండి ఉంటుందని తుఫాన్ అంటాడు. అంతే అంటావా అని సూర్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు సింహాద్రి కూతురు నిత్య జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుంది. తన ఫోన్ వాల్ పేపర్ పై సూర్య ఫోటో ఉంటుంది. తన ఫ్రెండ్ వచ్చి అబ్బా హీరోలా ఉన్నాడని ముద్దు పెట్టబోతుంటే తనపై నిత్య కోప్పడుతుంది. నా బావ నాకే సొంతమని నిత్య అంటుంది. ఒకవేళ అతను ఎవరినైనా ప్రేమిస్తే ఎలా అని తను అడుగుతుంది. ఆ ప్రేమించిన అమ్మాయిని చంపేస్తానని నిత్య అంటుంది.

మరొకవైపు జాను వాళ్ళ నాన్న శంకర్ ఫోటోని చూస్తూ జాను ఎమోషనల్ అవుతుంది. జానుకి సూర్య ఫోన్ చేసి సింహాద్రి మావయ్య దగ్గర పని చేసే వీరబాబు ఫోటో పంపిస్తున్నాను.. అతన్ని కలిస్తే అంతా బయటపడుతుందని సూర్య వాయిస్ మెసేజ్ చేస్తాడు. ఆ తర్వాత వీరబాబు దగ్గరికి జాను, సూర్య కలిసి వస్తారు. మీరు నాకొక హెల్ప్ చెయ్యాలి. ఈ తోట గురించి చెప్పాలని జాను రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో వీరబాబు అసలు నిజం చెప్తాడు. తరువాయి భాగంలో వీరబాబు చెప్పిన ఇన్ఫర్మేషన్ తో తోట రిజిస్ట్రేషన్ జరుగుతున్న దగ్గరికి జాను, సూర్య వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com