.webp)
డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమో చూస్తే బాబోయ్ వీళ్ళు పిల్లలా అన్నట్టుగా ఉన్నారు. పిల్లలు పిల్లల్లా లేరు అలా అని జడ్జెస్ కూడా పెద్దవాళ్లలా లేరు. వాళ్ళు కూడా పిల్లలతో కలిసిపోయి స్కిట్స్ లో పార్టిసిపేట్ చేయడం జోక్స్ పంచులు వేస్తూండేసరికి ఈ షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతోంది. ఇక ఈ వారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే భలే ఫన్నీగా ఉంది. అందులో అనిల్ రావిపూడిని ఇద్దరు చిన్నారులు రోస్ట్ చేశారు. ఇంతకు ఎం చేశారంటే...
ఇక గత సీజన్ లో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఈర్య ఈ సీజన్ లో దుమ్ము దులుపుతున్న శ్రీవియ పోట్లాడుకున్నారు. ఆ మధ్యలో అనిల్ రావిపూడిని రోస్ట్ చేశారు ఇద్దరూ. "అనిల్ తమ్ముడు మిల్క్ సెంటర్ - ఇచ్చట ప్రేమతో పాలు అమ్మబడును " అంటూ ఒక పాల బూత్ ని ఓపెన్ చేసింది శ్రీవియా. ఇందులో ఈ పిల్ల అనిల్ రావిపూడిని ముద్దుగా తమ్ముడు అంటే అనిల్ కూడా ప్రేమగా అక్కా అని పిలుస్తాడు. ఇక లాస్ట్ సీజన్ లో ఈర్య అనిల్ రావిపూడిని మామ అని పిలిచేది ఇక ఈ సీజన్ లో అనిల్ మామ మ్యాచింగ్ సెంటర్ అంటూ షాప్ ఓపెన్ చేసింది.
"నా చేత్తో గోరుముద్దలు తినిపించా నా షాప్ రిబ్బన్ ముందుగా కట్ చెయ్యి " అంటూ శ్రీవియా ఒక వైపు మరో వైపు "సొసైటీలో మామ అనే పిలుపుతో నీకు పేరు తెచ్చాను నా షాప్ నే ముందు ఓపెన్ చేయాలి" అంటూ పోటీ పడ్డారు. తర్వాత ఇంకో చిల్డ్రన్స్ టీమ్ వచ్చి డ్రామా జూనియర్స్ 2026 అవార్డ్స్ ని అందించారు. రోజాకి "బెస్ట్ సహనశీలి" అవార్డుని అందించగా శ్రీకాంత్ కి "బెస్ట్ రైజింగ్ స్టార్ ఆఫ్ తెలుగు టీవీ" అనే అవార్డుని అందించారు. ఫైనల్ గా సెట్ లో ఒక పెద్ద టేబుల్ వేసి పిల్లలందరికీ భోజనాలు వడ్డించారు. రోజా ఐతే సుధీర్ కి తినిపించారు. అనిల్ రావిపూడి మెయిన్ సీట్ లో కుర్చునేసరికి సుధీర్ వచ్చి మల్లేశ్వరి మూవీలో సెటప్ లా ఉంది సర్ అంటూ సుధీర్ అనేసరికి ...అంటే నువ్వు వేంకటేశా అంటూ అనిల్ రావిపూడి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు.




.webp)
.webp)
