పెళ్లి కాకుండానే భార్య కోటి రాస్తున్న రాకింగ్ రాకేష్!
on Jan 24, 2023
పెళ్లికుండానే భార్య కోటి రాస్తున్నాడు రాకింగ్ రాకేష్ ..ఇదేంటి అనుకుంటున్నారు కదా.. బుల్లితెర మీద ఆద్యంతం ఆహ్లాదంగా సాగిపోతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో స్కిట్స్ అన్నీ కూడా ఫుల్ నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి. ఈ మధ్య వర్ష ఇమ్మానుయేల్ తో కాకుండా సత్తిపండుతో కలిసి స్కిట్స్ చేస్తోంది. ఇక రాబోయే వారం స్కిట్ లో సత్తిపండు-వర్ష ఇద్దరూ భార్యాభర్తలుగా చేశారు. "మనకు అబ్బాయి పుడితే బాగుంటుంది అని వర్ష అనేసరికి కాదు అమ్మాయే పుట్టాలి ఎందుకంటే మా ఆఫీస్ లో ఒక కండిషన్ పెట్టారు ఇంట్లో ముగ్గురు అబ్బాయిలు ఉంటే లోన్ ఇవ్వరంట"..అన్నాడు సత్తిపండు. "ముగ్గురబ్బాయిలు ఎక్కడున్నారు" అని వర్ష అడిగేసరికి.."నేను, నువ్వు, పుట్టబోయే వాడు" అని చెప్పాడు సత్తిపండు.
తనను అబ్బాయి అనేసరికి షాకయ్యింది వర్ష. నిన్న మొన్నటి వరకు ఇమ్మానుయేల్ వర్షాని అబ్బాయి అనేసరికి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు ఆ డైలాగ్ నే సత్తిపండు ఇంకా సాగదీస్తూ చిరాకు తెప్పిస్తున్నాడు ఆడియన్స్ కి. ఈ స్కిట్ ఇలా సాగింది. ఫైనల్ గా షబీనా, ప్రవీణ్, రాకింగ్ రాకేష్ చేసిన స్కిట్ కూడా మంచి హిలేరియస్ గా నవ్వించింది. రాకేష్ భార్య కోటి రాయడం ప్రవీణ్ దాన్ని చూసి రాకేష్ ని పిచ్చ కొట్టుడు కొట్టి ఎవరైనా రాస్తారా భార్య కోటి అని అడగడం నవ్వు తెప్పించింది.
తర్వాత "పదమ్మా నీ విగ్గుకు తలంటుతా" అని జోర్దార్ సుజాతను లోపలికి తీసుకెళ్లాడు రాకేష్. ఇంతలో "చూసారా భార్య అంటే ఎంత ప్రేమో" అని షబీనా ప్రవీణ్ కి చెప్పేసరికి.."అంటే నీకు కూడా స్నానం చేయించాలి అంతేనా" అని ప్రవీణ్ అడిగేసరికి వద్దులే...అంది షబీనా. ఇలా రాకింగ్ రాకేష్ కి పెళ్లి కాకుండానే భార్య కోటి రాస్తున్నాడంటే పెళ్ళైతే ఇంకేం రాస్తాడో అంటున్నారు నెటిజన్స్.
Also Read