చిరంజీవిగారి అమ్మకు నేనంటే ఇష్టం..
on Jul 7, 2025

మొగలిరేకులు అంటే చాలు ముందుగా గుర్తొచ్చేది ఆర్కే.నాయుడు రోల్. ఇక ఆయన సీరియల్ తర్వాత కొన్ని మూవీస్ లో నటించారు. లేటెస్ట్ గా సుమ చాట్ షోకి వచ్చారు. "చిరంజీవి గారి అమ్మ గారికి నేనంటే చాలా ఇష్టం. నన్ను అభిమానిస్తారు. నాకు ఆమె ఆ దేవుడిచ్చిన అమ్మ అనుకుంటాను. చిరంజీవి గారి తాతయ్య గారి పేరు కూడా ఆర్కే.నాయుడు. ఆయన కూడా ఒక పోలీస్ గా చేసారు. అందుకే చిరంజీవి గారి వాళ్ళ అమ్మగారు నన్ను చూసినప్పుడల్లా వాళ్ళ నాన్న గారిని చూసినట్టే ఉంటుంది అనేవారు. నాకు చాలా టచింగ్ గా అనిపిస్తుంది అమ్మ మాట. ఇక పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉన్నాను. జనసేనలో చేరాను. పార్టీ కాకముందు ఆయనతో ఫోటో దిగాను. ఇప్పుడు ది 100 మూవీ ప్రొడ్యూసర్ వెంకీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తీసుకెళ్లారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎప్పుడూ మర్చిపోలేను. నేను అక్కడికి వెళ్లేసరికి ఆయన వేరే వరల్డ్ లో ఉన్నారు. ఏదో పొలిటికల్ బుక్ చదువుతూ ఉన్నారు. ఆయన నన్ను చూసి మీరా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్ తెలుసా అంటూ లేచి హగ్ చేసుకున్నారు. చాలా షాకయ్యా.
ఆయన చాలా గ్రేట్ పర్సన్. జనసేనలోకి వెళ్లిన తర్వాత నేను చాలా నేర్చుకున్నా. ఆయనతో కలిసి పిఠాపురంలో స్టార్ కాంపైనర్ గా ప్రచారం చేశా. అలాగే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ఆయనతో కలిసి వ్వాట్ నెక్స్ట్ అంటూ డిస్కషన్స్ కూడా చేసాను. ఆయన్ని చూస్తే ఒక మనిషి ఎలా బతకాలి, సొసైటీకి ఎం ఇవ్వాలి, ఎలాంటి బాధ్యత ఉండాలి అనే తెలుసుకున్నా. ఆయనతో కలిసి పని చేసే అవకాశం నాకు వచ్చింది. జనసేనలో నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి అనేది ఏమీ లేదు. ప్రజలకు ఎం ఇవ్వాలి అన్నదే నేను ఆయన నుంచి నేర్చుకున్నా అదే ఫాలో అవుతున్నా. జనసేనలోకి వచ్చేవాళ్ళు అలాగే ఉండాలి అనుకుంటున్నా. ఎం చేయాలి అన్నదే ఆలోచిస్తున్నా పాలిటిక్స్ పరంగా నేనేమీ ఆశించట్లేదు." అని చెప్పుకొచ్చారు సాగర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



