ENGLISH | TELUGU  
Home  » TV News

వసుధార మెడలో తాళి లేకపోవడంతో రిషి ఫుల్ ఫైర్!

on Apr 8, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -731 లో.. జగతి జయచంద్రతో.. రిషి, వసుధారల గురించి చెప్తుంది. జయచంద్ర వల్ల రిషి వసుధాలు తమ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుసుకున్నారు. వసుధారని ఇక బాధ పెట్టలేను భార్యగా అంగీకరిస్తానని రిషి అనుకుంటాడు. మరోవైపు వసుధార కూడా నేను చేసిన పని వల్ల రిషి సార్ బాధ పడ్డాడు.. నన్ను భార్యగా అంగీకరిస్తాడా అంటూ ఆలోచిస్తూ నిద్రపోతుంది వసుధార. జగతి, దేవయాని ఇద్దరు వసుధార మెడలో ఉన్న తాళి గురించి గొడవపడతారు. రిషిని ఉహించుకొని మనస్ఫూర్తిగా తనని భర్తగా అనుకొని వసుధార తన మెడలో తాళి వేసుకుందని జగతి అంటుంది. దారిన పోయే వాళ్ళందరూ ఉహించుకొని మెడలో తాళి వేసుకుంటే భార్య భర్తలు అయిపోతారా అని దేవయాని అంటుంది. ఇక ఇదంతా నిద్రలో కలకంటూ నా తాళిని ఏం చెయ్యొద్దంటూ కలవరిస్తుంది వసుధార. 

మరుసటి రోజు ఉదయం దేవయాని కోపంగా ఈ జయచంద్ర వచ్చినప్పటి నుండి రిషి, వసుధారలు దగ్గరయ్యారు అనుకొని వసు దగ్గరికి వెళ్తే మనకి ఏదైనా మ్యాటర్ దొరకచ్చని భావిస్తుంది. వసుధార గదికి దేవయాని వెళ్తుంది. అదే సమయంలో వసుధార వాష్ రూమ్ లో ఉంటుంది. వసుధార మెడలోని తాళి బెడ్ పై పడి ఉండడం చూసి అది తీసుకొని రిషి రూమ్ లోకి వెళ్తుంది దేవయాని. రిషి కిటికీ దగ్గర నిల్చొని బయట వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు దేవయాని వస్తుంది. వసుధార వచ్చిందేమో అని రిషి అనుకొని.. రా వసుధార అంటాడు. కాని దేవయాని వచ్చి.. రిషి చూడకముందే ఆ తాళి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఇక రిషి వెనక్కి చూసేసరికి వసుధార ఉండదు. తన మెడలోని తాళి అక్కడ ఉండడం చూసి కోపంగా దాన్ని తీసుకొని హాల్లోకి వచ్చి గట్టిగ వసుధార.. వసుధార అని పిలుస్తాడు. అప్పుడు అందరూ హాల్లోకి వచ్చి ఏమైందని రిషిని అడుగుతారు. నన్ను ఉహించుకొని మెడలో ఈ తాళి వేసుకున్నా అని చెప్పావ్ కదా? మరి ఇప్పుడు ఇది ఎందుకు తీసావంటూ రిషి తనపై కోప్పడతాడు. సర్ ఈ తాళి ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదని వసుధార ఏడుస్తుంది. జగతి, మహేంద్ర లు మళ్ళీ ఇదేంటని కంగారుపడుతారు.

ఆ తర్వాత ఫణింద్ర ఈ గొడవ మధ్యలో కలుగజేసుకొని.. దేవయాని నువ్వు వసుధార రూమ్ లోకి వెళ్ళడం నేను చూసాను. ఆ తాళి నువ్వే వసుధార దగ్గర నుండి రిషి రూంలో పెట్టావా అని అంటాడు. దేవయాని ఏం చేయలేక.. అవును వసుధార రూంలో తాళి పడిపోయి ఉండడం చూసి రిషికి ఇస్తే.. రిషి మళ్ళీ వసుధార మెడలో వేస్తాడని ఈ విషయం చెబుదామనే లోపు ఇదంతా జరిగిందని కవర్ చేస్తుంది దేవయాని. సారీ వసుధార తప్పుగా అపార్థం చేసుకున్న అని హాగ్ చేసుకుంటాడు రిషి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.