Home

»

Tv News

Karthika Deepam 2: స్వప్న తుది నిర్ణయం అదే.. నిజం తెలిసి షాకైన దశరథ్!

Feb 28, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-606 లో.. దశరథ్ ని ఇంటి బయటకి తీసుకొచ్చి మాట్లాడతాడు కార్తీక్. వాళ్ళు దుర్మార్గులు.. అత్తయ్య ఆపరేషన్ జరిగే దాకా మనం వెయిట్ చేయాలి.. లేదంటే వాళ్లు ఏం చేయడానికైనాసిద్ధపడతారని దశరథ్ తో కార్తీక్ అంటాడు. 

అదే సమయంలో కార్తీక్ కి డాక్టర్ ఫోన్ చేసి.. అర్జెంట్ గా దీపని తీసుకొని హాస్పిటల్ కి రండి అని చెప్తుంది. అదే విషయం దశరథ్ కి కార్తీక్ చెప్పగా నేను వస్తానని దశరథ్ అంటాడు. వద్దని కార్తీక్ అంటాడు. దాంతో దశరథ్ కి అనుమానం కలుగుతుంది. 

మరోవైపు శ్రీధర్, కాంచన మాట్లాడుకుంటారు. స్వప్న, కాశీ ఇద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయారని శ్రీధర్ అంటాడు. దాంతో కాంచన బాగా ఆలోచించి తన నిర్ణయం చెప్తుంది. స్వప్న, కాశీలకి విడాకులు ఇప్పించండి ఆ తర్వాత స్వప్నకి ఒక అబ్బాయిని చూసి పెళ్ళి చేసేయ్యండి. ఆ తర్వాత కాశీకి మరో అమ్మాయితో పెళ్ళి చేసేయ్యండి అని కాంచన అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు. వాళ్ళని కలపాల్సింది పోయి.. ఇలా అంటావా అని శ్రీధర్ అడుగగా.. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని కాంచన అంటుంది. 

ఇక శ్రీధర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ కాంచన, దాస్, కాశీ, స్వప్న అందరు ఉంటారు. ఇక వారి ముందు శ్రీధర్ తన ఆలోచన చెప్తాడు. దాంతో దాస్ షాక్ అయి మీరు ఇలా అంటారేంటి బావ.. పిల్లలు ఏదో తొందరపాటులో విడాకులు అంటే కలపాల్సింది పోయి.. విడిపోమంటారా అని శ్రీధర్ తో దాస్ అనగానే చాలా చెప్పి చూశాను.‌. కావాలంటే నువ్వు ప్రయత్నించు అని దాస్ తో శ్రీధర్ అనగానే అతను చాలా చెప్పి చూస్తాడు కానీ స్వప్న తన నిర్ణయం మార్చుకోదు. 

మరోవైపు డాక్టర్ దగ్గరికి దీప, కార్తీక్ వెళ్తారు. ఆపరేషన్ కి సిద్దంగా ఉన్నారా అని డాక్టర్ అడుగుతుంది. మేం సిద్దమే అని దీప, కార్తీక్ అంటారు. అయితే ఇప్పుడు మీకొక విషయం చెప్పాలి.. ఏంటంటే ఆపరేషన్ అయ్యాక దీపకి ఇంక ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని చెప్తుంది. దానికి సిద్ధమైతే నెక్స్ట్ స్టెప్ కి ప్రొసీడ్ అవుదామని డాక్టర్ అనగానే దీప, కార్తీక్ షాక్ అవుతారు. 

ఇక అప్పుడే దశరథ్ వస్తాడు. అది విని షాక్ అవుతాడు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని దశరథ్ అనగానే డాక్టర్ అంతా చెప్తుంది. అంటే నా భార్య ప్రాణాలతో ఉండాలంటే దీప తన బిడ్డని త్యాగం చేయాలా అని దశరథ్ అడుగగా అవునని డాక్టర్ చెప్తుంది. దాంతో ఈ ఆపరేషన్ కి నేను ఒప్పుకోలేను.. నా భార్యని వేరేలాగా బ్రతికించుకోలేమా అని దశరథ్ అడుగుతాడు. 

నేను చాలా మంది సీనియర్ డాక్టర్స్ ని అడిగే ఈ నిర్ణయానికి వచ్చానని డాక్టర్ చెప్తుంది. వేరే దారి లేదా అని దశరథ్ అడుగగా.. లేదు.. ఇద్దరిలో ఎవరో ఒకరే సేఫ్ అవుతారని డాక్టర్ అనగానే దశరథ్ షాక్ అవుతాడు. దశరథ్ ఎమోషనల్ అవుతూంటే కార్తీక్ ఓదారుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com