సుమతో విడిగా ఉండటంపై నోరువిప్పిన రాజీవ్ కనకాల!
on Jul 26, 2021

రాజీవ్ కనకాల, సుమది అన్యోన్య దాంపత్యం. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయని, ఇద్దరూ వేరు పడ్డారని, విడివిడిగా ఉంటున్నారని ఒకానొక సమయంలో పుకార్లు షికార్లు చేశాయి. రాజీవ్ కనకాల తన ఆస్తులను అమ్ముకున్నారనే ప్రచారం కూడా జరిగింది. వీటిపై రాజీవ్ కనకాల స్పందించారు. ఆ పుకార్లలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
"నేను, సుమ, పిల్లలు ఎల్&టిలో ఉంటున్నాం. అమ్మగారు కాలం చేసిన తర్వాత మణికొండలో ఇల్లు ఖాళీగా ఉండింది. నాన్న(దేవదాస్ కనకాల)తో నేను అక్కడ ఉన్నాను. నాన్నను తీసుకుని అపార్టుమెంట్‌కు వద్దామంటే... ఆయన దగ్గర బోలెడు పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ పట్టేంత ప్లేస్ ఫ్లాట్‌లో ఉండదు. అక్కడ (మణికొండలో) ఇల్లు పెట్టుకుని, ఇక్కడ రెంట్ కట్టి... ఎక్ట్రా బర్డెన్ ఎందుకని నేను నాన్న ఇంటికి వెళ్లా. మధ్యలో మా ఇంటికి షటిల్ అవుతూ ఉండేవాడిని. ఇదీ జరిగింది. అప్పుడు మేం వేరుపడ్డామని అనుకుని ఉంటారంతే" అని రాజీవ్ కనకాల వివరించారు.
దేవదాస్ కనకాల పలు చిత్రాల్లో నటించారు. ఫిల్మ్ స్కూల్ పెట్టి పలువురికి నటనలో శిక్షణ ఇచ్చారు. ఆగస్టు 2, 2019లో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దేవదాస్ కనకాల కుమారుడిగా పరిశ్రమలోకి ప్రవేశించిన రాజీవ్ కనకాల నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. లేటెస్ట్‌గా 'నారప్ప' మూవీలో వెంకటేశ్ బావమరిది బసవయ్య పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



