స్వప్న మీద మనసు పారేసుకున్న రాజ్!
on Feb 4, 2023
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ -10 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో... స్వప్నతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు రాజ్. తన దగ్గరే ఉండి తన గురించి తెలుసుకోవాలనుకుంటాడు రాజ్.
స్వప్న తో రాజ్ ప్రేమగా మాట్లాడడం చూసిన కనకం.. "నా కూతురు ఎలాగైనా ఈ ఇంటికి కోడలు అయ్యేలా ఉంది" అంటూ మురిసిపోతుంది. అలాగే సీతారామయ్యతో రాజ్.. "స్వప్న మన ఇంటి పూజ ఆగకూడదని డాన్స్ చేసింది. అంత చేసిన స్వప్నకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న తాతయ్య" అని చెప్తాడు. సరే రాజ్ సంగీతానికి సత్కారం జరిగినట్లు ఉంటుంది. మంచిదే కదా ఇవ్వు అంటాడు సీతరామయ్య. దాంతో రాజ్ స్వప్నకి డైమండ్ నెక్లెస్ ఇస్తాడు.
కనకం మాటల్లో ఏదో తేడా ఉందని గమనించిన రాజ్ అత్తయ్య రుద్రాని.. అన్ని ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటుంది. కనకం మాట దాటే ప్రయత్నం చేస్తుంటుంది. మళ్ళీ ఎలాగైనా రాజ్ ని కలవాలని భావించిన స్వప్న తన చెవి కమ్మని బెడ్ మీద పడేసి వెళ్తుంది. అందరూ ఆటోలో వెళ్లడం చూసిన రుద్రాని.. "ఇంత రిచ్ పీపుల్ ఆటోలో వెళ్లడం ఏంటీ.. వీళ్ళ సంగతి ఏంటో చూస్తా" అని అనుకుంటుంది.
నా డ్యాన్స్ కి బహుమతిగా ఈ నెక్లెస్ ఇచ్చారంటూ స్వప్న మురిసిపోతుంది. "ఆ నెక్లెస్ కావ్య అక్కకి చెందాలి.. అక్కే డాన్స్ నేర్పించింది" అంటూ అప్పు దానిని స్వప్న చేతినుండి తీసుకొని కావ్య మెడలో వేస్తుంది. నాకు వద్దని కావ్య చేతిలోకి తీసుకోగా.. "నేను డ్యాన్స్ చేస్తే వచ్చింది" అని బలవంతంగా లాక్కుంటుంది స్వప్న. ఆ తోపులాటలో కావ్య చేతికి గాయం అవుతుంది. ఇదంతా విన్న వాళ్ళ నాన్న "అక్కడ ఏదో జరిగింది... ఏం జరిగింది చెప్పు అప్పు" అంటూ అడుగుతాడు. అప్పు అక్కడ జరిగిందంతా చెప్తుంది. దాంతో కనకం మీద కోప్పడతాడు కనకం భర్త. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read