
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1194 లో ఆఫీస్ లో ఓ అమ్మాయికి ప్రశాంత్ లైన్ వేస్తుండగా రాజు, ఇందూలకి దొరికిపోతాడు. తర్వాత రాజు, ప్రశాంత్ లను లోపలికి పిలిచిన ఇందూ ఓ డీల్ గురించి చెప్తుంది. హైదరాబాద్ లో పెద్ద రాజ వంశానికి చెందిన రుద్ర ప్రతాప్ అనే ఆయన తన కూతురికి తరతరాలుగా వస్తున్న నగల్ని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నారని అయితే వాటిని ఇవ్వడం సంప్రదాయంగా కుదరదని చెప్తుంది. అందుకే వాటిలాంటి నగల్నే గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నారని, దాని కోసం టెండర్ రిలీజ్ చేయబోతున్నారని చెప్తుంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని కంపెనీలు టెండర్ లో పార్టిసిపేట్ చేయాలని.. ఈ టెండర్ మనకే రావాలని ఇందు ఆర్డర్ వేస్తుంది. ఈ డీల్ మనకొస్తే మన కంపెనీ ఫ్యూచర్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని భర్తకి చెప్తుంది.
జాబ్ లో చేరడానికి వెంకీ దుగ్గిరాల కంపెనీకి వస్తాడు. అతన్ని చూసిన రాజ్ కంగారుపడొద్దని చెప్తాడు. ఇంతలో ఇందూ వచ్చి అంకుల్ ఒప్పుకున్నారు కాబట్టే వెంకీ ఇక్కడ నిలబడగలిగాడు.. చలపతి అంకుల్ కి థ్యాంక్స్ చెప్పాలని అంటుంది. దాంతో వెంకీ, రాజు ఇద్దరు కంగారుపడతారు. ఇంతలో ప్రశాంత్ కి వెంకీని పరిచయం చేసి వర్క్ గురించి చెప్పమని అంటుంది. నన్ను నమ్మి ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని వెంకీ అంటే నందూ వల్లే నీకు జాబ్ ఇచ్చానని ఇందూ అంటుంది. నాన్నకి నిజం చెప్పలేదు.. కనీసం వదినకైనా నిజం చెప్పమని వెంకీ అడిగితే వదినకి తెలిస్తే అస్సలు ఆఫీస్ లో అడుగుపెట్టనివ్వదని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఏం జరిగినా నేను చూసుకుంటానని తమ్ముడికి ధైర్యం చెప్తాడు. మన కంపెనీకి 300 కోట్ల బిజినెస్ ఆఫర్ వచ్చిందని ఐశ్వర్య పీఏ, మేనేజర్ మాట్లాడుకుంటారు. ఇంతలో ఐశ్వర్య, రఘువీర్ లు వస్తారు. ఆయన నా బిజినెస్ పార్టనర్, రఘువీర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలని ఐశ్వర్య ఆర్డర్ వేస్తుంది.
వచ్చి రావడంతోనే మీ అందరికి 2 నెలల బోనస్ ఇస్తున్నానని రఘువీర్ చెప్పడంతో పీఏ పారు సంబరపడిపోతాడు. హైదరాబాద్ కి చెందిన రుద్ర ప్రతాప్ గారు సిటీలో ఉన్న అన్ని జ్యువెలరీస్ కి ఛాలెంజ్ విసిరారని, తన కూతురికి నగలు చేయించాలని అనుకుంటున్నారని రఘువీర్ చెప్తాడు. ఆ డీల్ మనకి వస్తే ఐశ్వర్య జ్యువెలరీస్ పేరు ఆకాశాన్ని తాకుతుందని అంటాడు. కింగ్ రుద్ర ప్రతాప్ గారు ఆన్ లైన్ లోకి వచ్చి తమ వంశీకులు పది తరాలుగా కాపాడుతున్న అమూల్యమైన సంపదను చూపిస్తాడు. త్వరలోనే మా కుమార్తెకు పెళ్లి చేయబోతున్నామని, కొత్త కోడల్ని కాదని ఈ నగల్ని కూతురికి ఇవ్వలేమని, అందుకే అచ్చం ఇలాంటి నగల్నే ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. ధర, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, ఉత్తమ కొటేషన్ కోసం ఎదురుచూస్తున్నామని అంటాడు. ఇందులో ఒక్క తప్పు జరిగినా కంపెనీ పేరు పోతుందని రాజ్, ఇందు ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






