అమర్ దీప్‌కి వెన్నుపోటు పొడిచిన ప్రియాంక జైన్!
on Sep 22, 2023
నా అనుకున్నవాళ్ళే మోసం చేస్తే దానిని ఏం అంటారు. నమ్మినవాళ్ళే మనల్ని అనర్హులని అంటే ఎలా ఉంటుంది. అయిన వాళ్ళని మనవాళ్ళలా చూస్తే ఏం జరుగుతుంది. ఇవన్నీ బిగ్ బాస్ బ్యూటీ అరియాన చెప్పిన మాటలు. బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే కంటెస్టెంట్స్ తమ స్ట్రాటజీలతో గేమ్స్ ఆడుతున్నారు. సీరియల్ బ్యాచ్ అంటూ ఎప్పుడు కలిసి ఉండే ప్రియాంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి మధ్య కూడా పాలిటిక్స్ జరుగుతున్నట్టు నిన్నటి ఎపిసోడ్‌లో తెలిసింది. అమర్ దీప్ కి ప్రియాంక జైన్ నిజంగానే వెన్నుపోటు పొడిచింది. దీనిపై స్పందిస్తూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది అరియాన.
అరియాన గ్లోరీ.. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపాదించుకొని సెలబ్రిటీ అయిపోయింది అరియాన.. అరియాన మొదటగా తన కెరీర్ ని కుకింగ్ షోస్ తో మొదలు పెట్టింది. ఆ తర్వాత కామెడీ షోలకి యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చెయ్యడం అవి కాంట్రవర్సిటికీ దారితీయడంతో ఫేమస్ అయింది అరియాన. స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దాంతో అరియాన ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయిందని అనడంలో ఆశ్చర్యం లేదు. అరియాన అలా ఫేమస్ అయి బిగ్ బాస్ లో అవకాశం చేజిక్కించుకుంది. బిగ్ బాస్-4 లో ఎంట్రీ ఇచ్చి.. మేల్ కంటెస్టెంట్స్ తో నువ్వా, నేనా అన్నట్టు ఆర్గుమెంట్ చెయ్యడం వల్ల అరియానాలోని మరొక కోణం బయటకు వచ్చింది. అయితే జబర్దస్త్ అవినాష్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో చేసిన కొన్ని సంభాషణలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. వీళ్ళిద్దరి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. అయితే అనుకోకుండా బయటకు వచ్చిన అరియాన చాలా బాధపడింది.
కొత్తగా పరిచయమైన కంటెస్టెంట్స్ కి అమర్ దీప్ డిజర్వింగ్ అనిపించింది. కానీ బయటను, ఇంట్లోను క్లోజ్ గా ఉండే ఒకరికి మాత్రం అన్ డిజర్వింగ్ అనిపించింది. అమర్ దీప్ వెనుకలా అతను వీక్ కంటెస్టెంట్ అని చెప్పి, పోటీకీ అనర్హుడని చెప్పి , మళ్లీ తనకి ఎక్కడ తెలిసిపోతుందోనని.. 'బిగ్ బాస్ నా ఒపీనియన్ ని చేంజ్ చేసుకోవచ్చా' అని రిక్వెస్ట్ చేసింది ప్రియాంక జైన్. తను వెన్నుపోటు పొడుస్తుందని నా మొద్దు ఫ్రెండ్ అమర్ దీప్ కి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. అమర్ నువ్వు బయటకొచ్చాక ఈ వీడియో చూడమని అరియాన తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
