Home

»

Tv News

ఫ్రీగానే చూడొచ్చు... సబ్స్క్రిప్షన్ పై ప్రియాంక బోల్ట్ కామెంట్స్!

Jun 8, 2026 10:58AM

ఈమధ్య ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రతీ ఒక్క బుల్లితెర సెలబ్రిటీ సబ్స్క్రిప్షన్స్ పెట్టేసుకుంటున్నారు వాళ్ళ ప్రొఫైల్ కి . విష్ణుప్రియ మొదలు పెట్టిన ఈ సబ్స్క్రిప్షన్ అనే ప్రాసెస్ ని ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇక రీసెంట్ సుబ్స్క్రిప్షన్ గురించి ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ వర్ష గెస్ట్ గా వచ్చిన ప్రియాంక నల్కరిని అడిగింది. "నువ్వు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ పెట్టావా లేదా ?" అని వర్ష అడిగేసరికి "వామ్మో వద్దు తల్లి. అప్పుడప్పుడు ఇలా ఇంటర్వ్యూకి పిలువు ఏదన్న గిఫ్ట్ ఇవ్వు అదే చాలు నాకు. నేను హ్యాపీ  "అనేసింది. "ఎందుకంత భయపడ్డావ్ " అని మళ్ళీ వర్ష అడిగేసరికి "ఎందుకంటే నేను చూస్తున్నా కదా అలా. ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నాను.

ఐతే నాకు యూట్యూబ్ ఉంది." అంది. "ఏంటి ప్రియాంక సబ్స్క్రిప్షన్ అనగానే దణ్ణం పెట్టావ్ " అంది వర్ష. "అంటే నాకు అలా వద్దు. నన్ను చూసి మనీ కట్టేది అదంతా వద్దు. నాకు ఇష్టం లేదు. నేను యాక్టింగ్ చేస్తాను వర్క్ చేస్తాను. అలా సంపాదించుకుంటాను కానీ ఇలా ఫోటో పెట్టి అలా నాకు వద్దు. నాకు ఎంత కష్టమైన పరిస్థితి ఐనా కానీ ఒక పూట తినకుండా కూర్చుంటా నాకు అలా వద్దు. " అని చెప్పింది ప్రియాంక. "మా ప్రియాంకకు ఐతే ఇష్టం లేదు చూడాలి అనుకుంటే మీరు ఫ్రీగా చూడొచ్చు " అని వర్ష అనేసరికి "ఏయ్ ఫ్రీగా ఎం చూడొచ్చు " అంటూ నవ్వుతూ అడిగిని. "అంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రియాంక పెట్టే ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు కానీ పే చూసి చూడక్కర్లేదు " అని చెప్పింది వర్ష. "అవును మీరు ఎక్స్పెక్ట్ చేసేంత కంటెంట్ ఏమీ ఉండవ్ వేస్ట్" అని క్లారిటీ ఇచ్చింది ప్రియాంక.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com