బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది. ఇది అలాంటి ఇలాంటి ప్రోమో కాదు. సరికొత్తగా వచ్చేసింది. "ఎన్నో యుద్దాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు .. ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం. ఆ మహా సామ్రాజ్యాన్ని రూల్ చేసేది నేను కాదు. లవ్ చేసే ఫాన్స్ చెప్తారు." అంటూ "బిగ్ బాస్ కోరిక మేరకు మీ టీవీ వాల్యూం పెంచండి అంటూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూపించాడు అందులో ఒక తల్లి పిల్లలకు ఆవకాయ అన్నం కలిపి ముద్దలు తినిపిస్తుంది. తర్వాత కొంతమంది కుర్రాళ్లను తర్వాత ఒక రోడ్ సైడ్ టిఫిన్ వాలాని చూపించాడు. ఒక హెయిర్ సలోన్ ఒక కస్టమర్ చేయించుకున్న బిబి 10 హెయిర్ కట్‌ని చూపించాడు. మరో వైపు హైఫై ఫామిలీ హోమ్ థియేటర్ లో కూర్చుని పాప్ కార్న్ తింటూ బిగ్ బాస్‌ని ఎంజాయ్ చేయడం కనిపించింది. "వెల్కమ్ కింగ్ ...అమ్మ ఆవకాయ బిగ్ బాసు, క్లాసు మాసు కల్సే స్పేసు, ఆ స్వాగుకు మేము పెద్ద ఫ్యాన్సు నాగ్ సర్‌కి మేము కల్ట్ ఫ్యాన్సు బిగ్ బాస్ మాకెంతో క్లోజు , బిగ్ బాస్ మీకెంతో క్రెజు , బిగ్ బాస్ నిశ్శబ్దం ఏరోజు బిగ్ బాస్ మా డైలీ డోసు రోజూ బోలెడన్ని మెమొరీసు చూసే ఆడియన్స్ బిందాసు టీవీ స్క్రీన్‌లలో మల్టీప్లెక్సు ప్రతీ సీజన్‌తో కొత్త ఫేజు , బిబి లవ్వు తగ్గదు ఎంత పెరిగినా మా వయసు మాలో మేమె అవుతాము హోరాహోరీ ఫైటర్సు నచ్చినవాళ్లకు కష్టం వస్తే కన్నీళ్లు తుడిచే టిష్యూసు సీజన్స్ అన్ని కొత్తగా మా స్ట్రెస్ బస్టర్సు నాగ్ సర్‌కి మెం కల్ట్ ఫ్యాన్సు " అంటూ నోయెల్ సాంగ్ పాడుతూ డాన్స్ చేస్తూ ప్రోమో లాస్ట్‌లో అందరినీ ఎంటర్టైన్ చేసాడు. ఇంకా అన్ని రకాల క్లాస్ మాస్ వాళ్ళను చూపించి "చెదరని ప్రస్థానం తరగని అభిమానం బిగ్ బాస్ సొంతం..ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాఫ్టర్‌కి సాక్ష్యం కాబోతోంది.. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశావతారం..ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ " అంటూ చెప్పారు నాగార్జున.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బిగ్ బాస్ 10 దశావతారం ప్రోమో రిలీజ్ ....నోయెల్ ఆటా పాటా అదుర్స్!
Jun 7, 2026 3:08PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




