Home

»

Tv News

అలీ సీక్రెట్ లవ్ లెటర్స్ వ్యవహారం బయటపెట్టిన ప్రదీప్!

Jun 8, 2026 11:16AM

కుక్కు విత్ జాతి రత్నాలు షో ఈ వారం లవ్ థీమ్ స్పెషల్ గా వచ్చేసింది. హోస్ట్ జడ్జెస్ అంతా కలిసి రెడ్ అండ్ బ్లాక్ కంబినేషన్ కాస్ట్యూమ్స్ తో కలర్ గా వచ్చేసారు. ఇక ప్రదీప్ ఐతే సరదాగా ఒక లవ్ లెటర్ ని ఆడియన్స్ కోసం రాసాడు. స్కూల్ లో లవ్ లెటర్ రాయలేదు కాబట్టి ఇప్పుడు రాసాను అనేసరికి సంజయ్ తుమ్మ ఎంట్రీ ఇచ్చి స్కూల్ లో రాయకపోతే ఇంత టైం పడుతుంది లవ్ లెటర్ రాయడానికి నన్ను చూడు స్కూల్ లో, కాలేజ్ లో తర్వాత ఇప్పుడు లవ్ లెటర్స్ రాస్తూనే ఉన్నాను అంటూ చెప్పుకున్నారు. ఐతే ఆన్సర్ షీట్స్ కంటే లవ్ లెటర్స్ ఎక్కువున్నాయన్న మాట అంటూ ఆయన పరువు తీసేసాడు ప్రదీప్. ఈ మధ్యలో ప్రదీప్ అలీ లవ్ స్టోరీ గురించి అడిగాడు. "ప్రేమించేంత టైం నాకు రాలేదు, దక్కలేదు.  కానీ ఊళ్ళో మాత్రం ఒక అమ్మాయి ప్రేమించింది.

మా ఇంటి పక్కనే. లెటర్ రాసేసి నా షూ ఇంటి బయట ఉండేది అందులో పెట్టేసి వెళ్లిపోయేది." అన్నారు. వెంటనే ప్రదీప్ "ఆ షూలో లవ్ లెటర్ పెట్టినావిడ ఈపాటికి ఈ షో చూస్తూ ఉంటారు" అన్నాడు. "ఇప్పుడు రావాలంట నేనే మీ షూలో లవ్ లెటర్ పెట్టాను అని ఎం చేస్తారండి అలా వస్తే  " అని జడ్జ్ శ్రీదేవి అడిగారు.  " హాయ్ హౌ ఆర్ యు ఎలా ఉన్నా మీ ఆయన పిల్లలు ఎలా ఉన్నారు" అని అడుగుతా "లవ్ లెటర్ ని షూలో ఎప్పుడూ పెట్టకండి " అంటారు కదా అంది శ్రీదేవి. ఇక శ్రీదేవి తన లవ్ స్టోరీ గురించి చెప్తూ ప్రేమించే టైం దొరకలేదని చెప్పారు. సినిమా తన ఫస్ట్ లవ్ ఐపోయిందని సినిమాలు చేసేటప్పుడే పెళ్లి ఐపోయింది అని ఆ తర్వాత లవ్ చేసుకున్నామని నువ్వు కూడా పెళ్లి చేసుకుని ప్రేమించుకో అంటూ ప్రదీప్ కి సలహా ఇచ్చారు శ్రీదేవి.  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com