Home

»

Tv News

Illu illalu pillalu : వల్లి ప్రెగ్నెన్సీ డ్రామా.. దొరికిపోకుండా సుకన్య మాస్టర్ ప్లాన్!

May 27, 2026 11:01AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu pillalu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -481 లో.. కాలేజీలో విశ్వ అతని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. రేయ్ నిన్న మీరు చేసిన ర్యాగింగ్ కి ఆ అమూల్య మళ్ళీ కాలేజీకి రావడమే కాదు కాలేజీలోకి అడుగుపెట్టాలన్న భయపడుతుందని విశ్వ అనగానే అవునురా అని వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుతారు. ఇక అప్పుడే అమూల్య కాలేజీలోకి నడుచుకుంటూ వస్తుంటుంది. ఆమెను చూసిన విశ్వ ఫ్రెండ్ ఒకడు విశ్వ తో చెప్తాడు. దీనికి ఇచ్చిన డోస్ సరిపోలేదు అనుకుంటారా.. ఇంకా డోస్ పెంచండిరా.. ఈసారి ఇంటికి కూడా పోకూడదని చెప్పి అతని ఫ్రెండ్స్ ని పంపిస్తాడు విశ్వ. వాళ్ళు అమూల్య దగ్గరికి వెళ్తారు. వచ్చావా.. అంటే మేం అడిగినదానికి ఒప్పుకున్నట్టేనా.. ఏ రూమ్ బుక్ చేయాలి.. ఎక్కడ బుక్ చేయాలి.. ఏది బుక్ చేయమంటావని అమూల్యతో విశ్వ ఫ్రెండ్స్ అంటారు.‌ మీకు నేను బుక్ చేస్తానురా అంటూ ధీరజ్ ఎంట్రీ ఇస్తాడు‌. ఏరా నీకు కూడా కావాలా అని వాళ్ళు అంటారు. మిమ్మల్ని నేను కొట్డనురా.. మా లేడీస్ తో కొట్టిస్తానురా అని ధీరజ్ అంటాడు. కమాన్ లేడీస్ అనగానే కార్ లో నుండి వేదవతి, ప్రేమ, నర్మద బ్లాక్ అద్దాలు పెట్టుకొని కొబ్బరి బొండం తాగుతూ ఎంట్రీ ఇస్తారు. 

నర్మద, ప్రేమ, వేదవతి వాళ్ళు విశ్వ ఫ్రెండ్స్ దగ్గరికి రాగానే.. వీళ్ళా మమ్మల్ని కొట్టేది అంటూ విశ్వ ఫ్రెండ్స్ నవ్వుతూ హేళన చేస్తారు. ఇక అందరు ఫైటింగ్ మొదలెడతారు. విశ్వ ఫ్రెండ్స్ ని నర్మద, ప్రేమ, వేదవతి ఉతికారేస్తారు. మరోవైపు విశ్వ అదంతా చూసి పారిపోవాలనుకుంటాడు కానీ ధీరజ్ చూసి పట్టుకుంటాడు. ఏరా మా చెల్లినే ఏడిపిస్తావారా అంటూ కొడతాడు. నేనేం చేయలేదు.. నాకు సంబంధం లేదని విశ్వ అంటాడు. నువ్వు వాళ్ళతో సైగ చేయడం నేను చూశానురా అంటూ ధీరజ్ కొడతాడు. కాసేపటికి ధీరజ్ నుండి తప్పించుకొని ఇంటికి పారిపోతాడు విశ్వ. ఇంటికి వెళ్ళిన తర్వాత భద్రవతి, సేనాపతి వాళ్ళు చూసి ఏంట్రా ఏమైందని అడుగుతారు. ఆ ధీరజ్ గాడు కొట్టాడని విశ్వ చెప్తాడు. నేను నమ్మను.. నువ్వేం తప్పు చేయకుండా ఆ ధీరజ్ కొట్టడు అని వాళ్ళ నానమ్మ అంటుంది. అదేంటమ్మా విశ్వని నమ్మకుండా ఆ ధీరజ్ ని సపోర్ట్ చేస్తున్నావని అంటుంది. ఇద్దరు నాకు మనవళ్ళే అయితే ఇద్దరి గురించి నాకు తెలుసు.. వీడు తప్పు చేయకపోతే వాడు ఎందుకు కొడతాడని భద్రవతితో వాళ్ళ అమ్మ అంటుంది.

మరోవైపు వల్లి, సుకన్య తొక్కుడుబిల్ల ఆడుతున్నట్టుగా అది గీత, నేను గీసిన గీత అంటు ఆడుతుంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి నర్మద, ప్రేమ వస్తారు. ఏంటి చెల్లెల్లు ఇలా వచ్చారని వల్లి అడుగగా.. నిన్ను చూస్తుంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా లేవని నర్మద, ప్రేమ అనగానే డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నాడని సుకన్య కవర్ చేస్తుంది. అవునా అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫమ్ చేసుకుందాం పదా అని నర్మద, ప్రేమ అనగానే వల్లికి టెన్షన్ మొదలవుతుంది. ఇక వెంటనే డ్రామా మొదలెడుతుంది‌. వల్లి కళ్ళు తిరిగిపడిపోతుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఏం అయిందమ్మా అని రామరాజు అంటే నీరసంగా ఉందంటే వీళ్ళిద్దరు మాటలతో విసిగిస్తున్నారని సుకన్య అంటుంది. దాంతో ప్రేమ, నర్మదల మీద రామరాజు సీరియస్ అవుతాడు. కడుపుతో ఉన్నవాళ్ళని ఎలా చూసుకోవాలో తెలియదా అంటూ ప్రేమ, నర్నదలని రామరాజు తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com