.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -122 లో.......చక్రి, మహాని ప్రతాప్ తన ఇంటికి తీసుకొని వెళతానని అంటాడు. దాంతో నేను రాను మహాలక్ష్మిని కూడా పంపించనని చక్రి అంటాడు. ఎందుకని ప్రతాప్ అడుగుతాడు. నాకు ఈ రోజు సెలవు లేదని చక్రి అంటాడు. అయితే మహాని తీసుకొని నేను వెళ్తానని ప్రతాప్ అంటాడు. దాంతో చక్రిని మహా పక్కకి తీసుకొని వెళ్తుంది. ఏంటి నువ్వు ఎందుకు రానని అంటున్నావని కోప్పడుతుంది.
దాంతో చక్రి లోపలికి వస్తాడు. నేను మీతో పాటు వస్తానని చెప్తాడు. ఇందాక రాను అన్నావని ప్రతాప్ అడుగుతాడు. మా ఓనర్ ని ఒప్పించానని చక్రి చెప్తాడు. ఆ తర్వాత చక్రి వెళ్లి బట్టలు సర్దుకుంటాడు.. నువ్వు వెళ్ళనన్నావ్ కదరా.. మళ్ళీ ఏంటి నిర్ణయం మార్చుకున్నావని కేశవ అడుగుతాడు. నన్ను బ్రతిమిలాడింది రా అని చక్రి అనగానే అంతలేదు ఇప్పుడు నిజం చెప్పుర అని కేశవ అంటాడు. మహాని తీసుకొని వెళ్లి తనని అక్కడే ఉంచుకుంటారేమోనని భయమేస్తుందని చక్రి అనగానే నిజమేరా అని కేశవ అంటాడు. ఆ తర్వాత మహా, ప్రతాప్, చక్రి రెడీ అయి వస్తారు మహా వెళ్తుంటే కన్నా ఏడుస్తాడు. ఆ తర్వాత కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి శైలు వస్తుంది.. మనం చేసిన రీల్ ఫేమస్ అయింది.. మళ్ళీ చేద్దామా అని శైలు అనేసరికి తనపై కేశవ కోప్పడుతాడు. ఆ తర్వాత ప్రతాప్ కొద్దిదూరం వెళ్ళాక డ్రైవర్ ని పంపిస్తాడు. ఏంటి నాన్న అలా పంపించావని మహా అడుగుతుంది. మన మధ్యలో వేరేవాళ్లు ఎందుకని ప్రతాప్ అంటాడు. అయినా డ్రైవర్ అనేవాడు వెళ్ళమంటే వెళ్ళటోడే అని ప్రతాప్ అంటాడు. మరి డ్రైవింగ్ అని మహా అనగానే అల్లుడు గారు ఉన్నారు కదా అని ప్రతాప్ అంటాడు.
ఆ తర్వాత శైలు మళ్ళీ కేశవ దగ్గరికి వచ్చి నువ్వు రీల్ చెయ్యకపోతే ఎవరు చెయ్యరా మంచి అందగాడిని రమ్మన్నానని శైలు అంటుంది. అప్పుడే కేశవ దగ్గర పని చేసే అతను రెడీ అయి వస్తాడు. అతనితో రీల్ చేస్తుంది శైలు. మరొకవైపు ప్రతాప్, మహా చక్రి ఇంటికి వస్తారు. వాళ్ళకి హారతి ఇవ్వమని లలిత అనగానే హారిక హారతి ఇచ్చి లోపలకి ఆహ్వానిస్తుంది. లలితని హగ్ చేసుకొని మహా ఎమోషనల్ అవుతుంది. ఆదితో మహా సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
