Home

»

Tv News

Karthika Deepam2 : హాస్పిటల్‌లో హై డ్రామా.. దక్షిణామూర్తి ప్రాణాలు కాపాడిన కార్తీక్-దీప!

May 27, 2026 11:04AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -680 లో.....కార్తీక్, దీప గుడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంటారు. దారిలో దక్షిణామూర్తి  వాళ్ళని చూసి పిలుస్తాడు. వాళ్ళు ఆగుతారు. వాళ్ళ దగ్గరికి దక్షిణామూర్తి వెళ్తుంటే ఆక్సిడెంట్ అవుతుంది. దాంతో వెంటనే అతన్ని దీప, కార్తీక్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. బ్లడ్ చాలా పోయింది.. వెంటనే బ్లడ్ ఎక్కించాలని డాక్టర్ చెప్తారు. ఇప్పుడు ఎలా.. అతనికి సంబంధించిన వాళ్ళు మనకి తెలియదు కదా అని కార్తీక్ అనుకుంటాడు.

మరొకవైపు అదే హాస్పిటల్ కి శ్రీధర్ ని శివన్నారాయణ చెకప్ కి తీసుకొని వస్తాడు. హాస్పిటల్ లో దీప, కార్తీక్ ని చూసి ఏమైందని అడుగుతారు. గుడి నుంచి వస్తుంటే దారిలో ఆక్సిడెంట్ అయింది. వాళ్లని హాస్పిటల్ కి తీసుకొని వచ్చామని కార్తీక్ చెప్తాడు. అప్పుడే డాక్టర్ వచ్చి బ్లడ్ దొరికిందా అని అడుగుతాడు. ఏ బ్లడ్ గ్రూప్ అని అడుగుతాడు శివన్నారాయణ. డాక్టర్ బ్లడ్ గ్రూప్ పేరు చెప్పగానే నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నేను ఇస్తానని శివన్నారాయణ అంటాడు. వద్దు అని కార్తీక్ అంటాడు. అయిన వినకుండా శివన్నారాయణ వెళ్లి బ్లడ్ ఇస్తాడు. పేషేంట్ ని చూసి వస్తానని శ్రీధర్ వెళ్తాడు. అక్కడ దక్షిణామూర్తిని చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. వెంటనే కార్తీక్, దీప దగ్గరికి శ్రీధర్ వచ్చి.. మీరు ఎంత పెద్ద తప్పు చేసారో తెలుసా వెంటనే మీ తాతకి చెప్పండి అని శ్రీధర్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ బ్లడ్ ఇచ్చి వస్తాడు. పేషేంట్ ని చూసి వస్తానని వెళ్తాడు. అప్పుడే ఎవరో ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. దాంతో శివన్నారాయణ అక్కడ నుంచి వెళ్తున్నానని చెప్తాడు. ఇప్పటికే సేవ్ అయ్యావ్ కానీ దక్షిణామూర్తికి బ్లడ్ ఇచ్చానట్టు మీ తాతకి తెలిస్తే ఊరుకోరని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత దక్షిణామూర్తి దగ్గరికి దీప, కార్తీక్ వెళ్తారు. నీకు బ్లడ్ ఇచ్చింది మా తాత అని చెప్పగానే అతను షాక్ అవుతాడు. నాకు బ్లడ్ ఇచ్చానని తెలిస్తే నన్ను కాపాడిన మిమ్మల్ని కూడా తిడుతాడని దక్షిణామూర్తి అంటాడు.

మీకు తెలిసిన వాళ్ళ అడ్రెస్ చెప్పండి అని కార్తీక్ అనగానే అతను శివన్నారాయణ ఇంటి అడ్రెస్ చెప్తాడు. అక్కడ నా కూతురు ఉంది.. వీలైతే నా కూతురిని తీసుకొని రండీ అని దక్షిణామూర్తి అంటాడు. ఆ తర్వాత హాస్పిటల్ లో జరిగింది మొత్తం కాంచనకి శ్రీధర్ చెప్తాడు. ఆ దక్షిణామూర్తికి మీ నాన్న బ్లడ్ ఇచ్చాడని శ్రీధర్ చెప్తాడు. ఆ విషయం నాకు దీప, కార్తీక్ కి తెలుసని శ్రీధర్ అంటాడు. ఆ మాటలన్నీ పారిజాతం, జ్యోత్స్న వింటారు. ఛాన్స్ దొరికిందని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com