Home

»

Tv News

Podharillu: కుటుంబంతో కలిసిపోయిన పెద్ది.. మహా మాటలకు మారిన నారాయణ!

Aug 11, 2026 6:03PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-176లో.. చక్రి నలుగురు సిద్ధాంతులను తీసుకొస్తాడు. నలుగురు ఒకే మాట చెప్తారు—తరతరాలుగా పూజించే గ్రామదేవతను, ఇష్టదైవాన్ని ఈ తరం మర్చిపోయిందని, అందుకే దేవత కోపం, శాపం వల్లే ఈ కష్టాలు వచ్చాయని చెప్తారు. తండ్రి తీర్చాల్సిన మొక్కు కూడా మిగిలిపోయిందని గ్రామదేవతను పూజిస్తే అన్నీ సర్దుకుంటాయని అంటారు. కానీ దేవత ఎక్కడుందో నారాయణను అడిగితే మాత్రం ఆయన చెప్పకుండా మౌనంగా వెళ్లిపోతాడు. మరోవైపు పెద్ది తిరిగి ఇంటికి రావడంతో అందరు సంతోషిస్తారు. కోపంతో కొడుకును కొట్టినా, చివరికి కన్నీళ్లతో ఇక ఇంటి నుంచి వెళ్లొద్దని మాధవతో నారాయణ అంటాడు. పెద్ది కూడా తమ్ముళ్ల భవిష్యత్తు కోసమే ఇంటి నుంచి వెళ్లానని చెప్తాడు.

మహా అందరికి కాఫీ ఇస్తుంది. ఇల్లు వదిలి వెళ్లిపోతే సమస్యలు పరిష్కారమవుతాయని అనుకోవడం నిజమైన ప్రోగ్రెసివ్ థాట్స్ కాదని చెప్తుంది. పెద్ది ఈ కుటుంబాన్ని పూలను కలిపి ఉంచే దారంలాంటివాడని, అతని ప్రేమే అందరిని ఒక్కటిగా ఉంచుతోందని మహా అంటుంది. ఆ తర్వాత చక్రి సరదాగా మనీషా గెటప్ వేసుకుని అందరిని నవ్విస్తాడు. పెద్ది తన తమ్ముళ్ల గురించి ఎంతగా ఆలోచించాడో చెప్తాడు. కేశవ, కన్నా కూడా అన్నయ్య లేకపోతే తాము ఉండలేమని ఎమోషనల్ అవుతారు. చివరికి అందరు కలిసి నవ్వుతూ, ఆనందంగా భోజనం చేస్తారు. నారాయణ కూడా తన కొడుకుపై ప్రేమను బయటపెడతాడు. పెద్ది వెళ్లిపోతే ఎవరూ బాగుపడరని, కుటుంబమే ముఖ్యమని చెప్తాడు. మహా ఆయనకు సరదాగా “తత్త్వ పుత్ర” అని పేరు పెట్టడంతో అందరు నవ్వుతారు.

మరుసటి రోజు చక్రి, కేశవ కూరగాయలు తీసుకొస్తూ పెద్ది మళ్లీ ఎక్కడికైనా వెళ్లిపోతాడేమోనని భయపడ్డామని చెప్తారు. పెద్ది మాత్రం ఇక ఎక్కడికి వెళ్లనని ధైర్యం ఇస్తాడు. పెద్ది జాతకంలో ఎటువంటి దోషం లేదని సిద్దాంతులు చెప్పింది గుర్తుచేసి ..‌ఇప్పటికైనా నీ వల్ల మాకు ఎలాంటి నష్టం లేదని అర్థమైంది కదా అన్నయ్య అంటూ పెద్ది పక్కన నిలబడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

SEO Keywords:
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com