Home

»

Tv News

Brahmamudi:  పెళ్లిచూపుల్లో లక్కీకి అవమానం..వంద కోట్ల కలల్లో ఐశ్వర్య!

Aug 11, 2026 6:00PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-1107 లో.. పెళ్లిచూపుల్లో భాగంగా శేషు అడగడంతో అమ్మాయి ముసుగు తీస్తుంది. లక్కీ మాత్రం ఐశ్వర్యను తప్ప ఎవరిని చూడనని చెప్పడంతో రాజు బలవంతంగా అమ్మాయిని చూపిస్తాడు. లక్కీని చూసిన అమ్మాయి తల్లి, ఫోటోలో ఉన్నంత స్మార్ట్‌గా బయట లేడని అనడంతో రాజు, శేషు సరదాగా కవర్ చేస్తారు. లక్కీకి తల్లిదండ్రులు లేరని, అనాథాశ్రమంలో పెరిగాడని తెలిసి అమ్మాయి కుటుంబం ఆశ్చర్యపోతుంది. భ్రమరం, రేఖలపై కూడా విమర్శలు రావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. చివరకు తమ ఇంట్లో వాళ్లే లక్కీని పట్టించుకోవడం లేదని భావించిన అమ్మాయి కుటుంబం సంబంధాన్ని వద్దంటుంది. ఇక ఆ  అవమానంతో లక్కీ బాధపడతాడు. ఇదంతా అతని మంచికేనని రాజు చెప్తాడు.

తర్వాత రేఖను రాజు మాటలతో రెచ్చగొడుతూ, లక్కీని తిడుతున్నా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తాడు. లక్కీని కన్నకొడుకుగా భావించే ప్రేమను రేఖ దాచిపెడుతోందని రాజు చెప్తూ, ఆమెను నిజం బయటపెట్టేలా ఫోర్స్ చేస్తాడు. తనకు ఇచ్చిన గడువు పూర్తయిందని, ఇక నిజం చెప్పకపోతే తనే ఆ నిజాన్ని బయటపెడతానని రేఖకు రాజు వార్నింగ్ ఇస్తాడు. రేఖ మాత్రం తను ఎవరికి భయపడనని చెప్పేస్తుంది.

మరోవైపు ఐశ్వర్యను శశి తన మాటలతో ట్రాప్ చేస్తుంటాడు. శశి తన కోసం ఢిల్లీ నుంచి వచ్చి పార్టీకి పిలవడంతో, అతను తనకు ప్రపోజ్ చేయబోతున్నాడని, త్వరలోనే వంద కోట్లకు అధిపతిని అవుతానని ఐశ్వర్య కలలు కంటుంది. స్వాతి ఎంత చెప్పినా వినకుండా ఐశ్వర్య బయటకు వెళ్లిపోతుంది. ఆమె మాటలు, ప్రవర్తనలో ఏదో ప్రమాదం జరగబోతుందని స్వాతికి డౌట్ వస్తుంది. ఇందు మాత్రం కంగారు పడొద్దని, ఐశ్వర్య ఫోన్‌లో జీపీఎస్ ట్రాకర్ పెట్టానని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

SEO Keywords:

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com