Home

»

Tv News

Karthika Deepam2: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన జ్యోత్స్న.. నాకు పెళ్లే వద్దు అంటూ ఫ్యామిలీకి బిగ్ షాక్!

Aug 11, 2026 6:07PM

 

   

             

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2).  ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-745 లో..  సూరజ్ ప్రవర్తన మొదటి నుంచే అనుమానంగా ఉండటంతో శ్రీధర్, దీప, కార్తీక్‌లు అతని మనసులో జ్యోత్స్న ఉందని అర్థం చేసుకుంటారు. జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడానికే సూరజ్ ఇంతకాలం ఆఫీస్‌లో ఉన్నాడని అనుకున్నా, చివరికి పెళ్లినే రిజెక్ట్ చేయడంతో అందరు ఆశ్చర్యపోతారు. ఇద్దరి ఈగోల మధ్య మొదలైన యుద్ధంలో ఎవరో ఒకరు మనసు మార్చుకోవాల్సిందేనని, వాళ్లిద్దరినీ ఎలాగైనా కలిపి పెళ్లి చేయాలని దీప, కార్తీక్‌లు నిర్ణయించుకుంటారు. దీప సూరజ్‌కు ఫోన్ చేసి ఆఫీస్‌కు రావాలని చెప్తుంది. సూరజ్ కూడా జ్యోత్స్నను చూసి, తను అన్న మాటలకు ఆమె ఏం చేస్తుందో చూద్దామని అనుకుంటాడు.

మరోవైపు జ్యోత్స్న సూరజ్ తనను రిజెక్ట్ చేసిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతుంటుంది. సూరజ్ ఆమెను కలిసి, తను రిజెక్ట్ చేయడం ఎందుకు అంత బాధ కలిగించిందని ప్రశ్నిస్తూ, ఆమె మనసులో తనకు స్థానం ఉందా అని నిలదీస్తాడు. జ్యోత్స్న అతనిపై కోపం వ్యక్తం చేసినా, సూరజ్ మాత్రం “నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా నేను నమ్మాలి.. నేను నమ్మేలా నువ్వు మారాలి”  అని చెప్పేసి వెళ్లిపోతాడు. ఈ మాటలతో జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్నకి దీప ఫోన్ చేసి.. నిన్ను వద్దనుకున్న సూరజ్‌నే నీకు కావాలని చేసుకోవడమే నిజమైన గెలుపు అని చెప్తుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఇక ఎవరి మీద నమ్మకం లేదని, అవసరం లేని బంధాలు, ఎమోషన్స్ వల్ల తను మోసపోయానని అంటుంది.

మరుసటి రోజు దీప, కార్తీక్‌ ఇద్దరు కలిసి జ్యోత్స్న ఇంటికి వెళ్తారు. జ్యోత్స్న పద్ధతిగా చీర కట్టుకుని రావడంతో అందరు సూరజ్‌ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని భావిస్తారు. కానీ అందరికి షాక్ ఇస్తుంది జ్యోత్స్న. నాకు ఈ పెళ్లి వద్దు.. సూరజ్‌నే కాదు, అసలు ఎవరినీ పెళ్లి చేసుకోనని జ్యోత్స్న అంటుంది. కోపంతో కాకుండా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని, తనకు ఆస్తులు కూడా వద్దని, ఆఫీస్‌లో తను ఉద్యోగం చేసుకుంటూ జీవితాంతం ఒంటరిగానే ఉంటానని జ్యోత్స్న చెప్తుంది. పాత జ్యోత్స్న ఇక లేదని జ్యోత్స్న చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జ్యోత్స్న మాటలు విని కుటుంబమంతా బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com