.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -166 లో..... సురేష్ ని చక్రి వాళ్ళు కొట్టారని వాళ్ల వాళ్ళు కౌన్సిలర్ తో నారాయణ ఇంటి మీదకి గొడవకి వస్తారు.అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి అని మాధవ అంటాడు. శైలుని తీసుకొని రా అని బంటితో కేశవ చెప్తాడు. ఆ తర్వాత ఏంటి గొడవ అని పోలీసులు వస్తారు.
మరొకవైపు గాయత్రి తన భర్తతో పుట్టింటికి వస్తుంది. ఏంటి సడన్ గా వచ్చారని తాయారు అడుగుతుంది. ఫ్రెండ్ పెళ్లి ఉంటే ఇటుగా వచ్చామని అతను చెప్తాడు. అన్నయ్య వెళ్లి మటన్ తీసుకొని రా అని రమణయ్యని తాయారు పంపిస్తుంది. రమణయ్య గొడవ జరుగుతుంటే నారాయణ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత అందరిని అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటారు. అప్పుడే మహా లోపల నుంచి బయటకు వస్తుంది. పదండీ నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. వాడు నాతో తప్పుగా ప్రవర్తించాడని మహా అంటుంది. మహా జరిగింది మొత్తం ఇన్‌స్పెక్టర్ కి చెప్తుంది. అలా కాదు నా కూతురు వెంట అతను పడుతుంటే నా కొడుకు బెదిరించాడని వరాలు చెప్తుంది. అప్పుడే శైలు వచ్చి అదంతా అబద్ధం.. నేను అతన్ని ప్రేమిస్తున్నాను.. వీళ్ళు ఆ విషయం తెలిసి రోజు నన్ను కొడుతున్నారని శైలు చెప్తుంది. ఆ తర్వాత రమణయ్య మధ్యలో కలుగజేసుకొని మాట్లాడుతుంటే మహా కోప్పడుతుంది. తాయారు వచ్చి రమణయ్యని తీసుకొని వెళ్తుంది. ఏంటి అన్నయ్య నువ్వు.. వాళ్ళు మన జోలికి రావట్లేదు.. మనం కూడా వెళ్లొద్దని ఇంటికి వచ్చాక తనతో చెప్తుంటే గాయత్రి వింటుంది. ఏమైందని అడుగుతుంది. ఆ కేశవ గాడు ఎవరినో ప్రేమించాడట వాళ్ళు ఇంటి మీదకి గొడవకి వచ్చారని తాయారు అంటుంటే.. నేను ఒకసారి వెళ్ళొస్తానని గాయత్రి అంటుంది.
మరొకవైపు నారాయణ కుటుంబం గురించి వరాలు తప్పుగా మాట్లాడుతుంటే అప్పుడే గాయత్రి వచ్చి ఏం తెలుసు ఆ కుటుంబం గురించి అని నారాయణ కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుతుంది. నేను కేశవని పెళ్లి చేసుకుంటానని శైలు అంటుంటే సురేష్ కొడతాడు.
సురేష్ ని గాయత్రి కొడుతుంది. ఆ తర్వాత శైలు కచ్చితంగా కేశవని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఇంటికి వెళ్ళాక శైలుని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ సంగతి చెప్తానని కేశవ వార్నింగ్ ఇస్తాడు. తరువాయి భాగంలో శైలుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ విషయం కేశవకి తెలిసి చక్రి, మహాలకి చెప్తాడు. అది ఎలాగైనా ఆపాలని మహా, చక్రి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
