.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -67 లో...... సింహాద్రి తన అసలు రంగు జానూ ముందు బయటపెడుతాడు. అవును నేను మీ నాన్నని మోసం చేసాను ఏదో డైరీ అని రాసుకొని వచ్చి ఇదంతా గొడవ చేస్తున్నావ్.. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు.. తోట అమ్మగా వచ్చిన డబ్బుని నీకు చిల్లరగా విసిరేస్తానని సింహాద్రి అనగానే మీ అంతు చూస్తాను.. అసలు తోటని వదిలి పెట్టనని జాను అంటుంది. ఆ తర్వాత జాను వచ్చి గొడవ చేసిందని శారదకి ఫోన్ చేసి సింహాద్రి చెప్తాడు. మరొకవైపు ఎందుకు అమ్మా అందరు ఇలా చేస్తున్నారని భువనతో సూర్య అంటాడు మావయ్యని అన్ని మాటలు అంటుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావని భువన అంటుంది.
అవును ఆ జాను చెంప చెల్లుమనిపించాలని కళ్యాణ్ అనగానే నువ్వు ఆగురా వాళ్ళ బాధ నీకేం తెలుసని సూర్య అంటాడు. అప్పుడే సింహాద్రి లోపలికి వచ్చి అల్లుడు అని భుజం మీద చెయ్ వేస్తాడు. ఏంటి ఇన్ని రోజులు సూర్య అనేవాడివి ఇప్పుడు అల్లుడు అంటున్నావని సూర్య అంటాడు. అంటే తప్పేంటి ఎలాగు నా కూతురిని పెళ్లి చేసుకుంటున్నావని సింహాద్రి అంటాడు.. అవును రా నిత్య నీకు పర్ఫెక్ట్ జోడి.. మీకు పెళ్లి చెయ్యాలని మాట్లాడుకున్నామని భువన అనగానే సూర్య షాక్ అవుతాడు.
మరొకవైపు నందు, మురళి మార్కెట్ కి వెళ్తుంటే శాంతి కన్పిస్తుంది. మురళి వెళ్లి మాట్లాడతాడు. అక్కడ అత్తాకోడళ్లకి గొడవ జరుగుతుంది. ఎవరికి సర్ది చెప్పాలో మురళికి అర్ధం కాదు. ఆ తర్వాత మురళి, నందు ఇంటికి వస్తారు. అప్పుడే జాను కూడా వస్తుంది. ఎందుకు సింహాద్రి అన్నతో గొడవ పెట్టుకున్నావని శారద కోప్పడుతుంది. సింహాద్రి మనల్ని మోసం చేసాడు. తోట డబ్బు నాన్న మొత్తం ఇచ్చాడు. ఆ విషయం డైరీ లో రాసాడు. ఆ విషయం అడగడానికి వెళ్తే గొడవ చేసి డైరీ కాల్చేశారని జానూ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏదన్న ఉంటే మీ నాన్న చెప్పేవాడు నాతో అని శారదా అంటుంది. మనకి సర్ ప్రైజ్ అని ఏ విషయం చెప్పలేదు.. నాన్న చావుకి సింహాద్రి కారణమని జాను అనగానే అందరూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో సింహాద్రి దగ్గర పని చేసే అతని దగ్గరికి జాను, సూర్య వెళ్తారు. అతను తోట వేరేవాళ్లకి అమ్ముతున్నట్లు జాను, సూర్య వాళ్ళతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
